• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడియో: మ్యాన్ Vs వైల్డ్: నరేంద్ర మోడీ అడ్వెంచర్

|
  బేర్ గ్రిల్స్‌తో కలసి సాహసాలకు సిద్ధమైన మోదీ|Modi To Appear In Episode Of #ManvWild With Bear Grylls

  న్యూఢిల్లీ: డిస్కవరీ ఛానల్ క్రమం తప్పకుండా చూసే వారికి చిర పరిచితమైన ఎపిసోడ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. బ్రిటన్ కు రెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ ఒంటరిగా దట్టమైన అడవులు, ఆకాశానికి అంటే శిఖరాలు, పొయ్యిని తలపించే ఎడారుల్లో కలియ తిరుగుతూ, ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని కళ్లముందుకు తీసుకొచ్చే కార్యక్రమం అది. అదే ఎపిసోడ్ లో ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనిపించబోతున్నారు. బేర్ గ్రిల్స్ తో కలిసి నరేంద్ర మోడీ చేసిన అడ్వెంచర్ ను ఈ ప్రపంచం చూడబోతోంది. నరేంద్ర మోడీ కనిపించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ స్పెషల్ ఎపిసోడ్ వచ్చే నెల 12వ తేదీన రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఇండియాలో ప్రసారం కాబోతోంది.

  నాలుగోసారి ముఖ్యమంత్రిగా యడియూరప్ప: మూలాలు ఆర్ఎస్ఎస్ లో..ఉద్యోగం రైస్ మిల్లులో

  జిమ్ కార్బెట్ లో చిత్రీకరణ..

  ఈ ఎపిసోడ్ మొత్తాన్నీ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం బేర్ గ్రిల్స్ అదే పనిగా మనదేశానికి వచ్చారు. జిమ్ కార్బెట్ జాతీయ పార్కులోని ధికలా ఫారెస్ట్ లాడ్జిలో నివసించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కొనసాగింది. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి చోటు చేసుకున్న సమయంలో నరేంద్ర మోడీ జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో సరదాగా గడుపుతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పుడాయన మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ లో గడుపారనే విషయం స్పష్టమైంది.

  PM Modi to appear in special episode of Man vs Wild on Discovery with Bear Grylls

  ప్రపంచం సరికొత్త మోడీని చూస్తుందంటూ..

  ఈ ఎపిసోడ్ ప్రసారం తేదీ ఖరారైన నేపథ్యంలో.. బేర్ గ్రిల్స్ తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీపై చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ లోని కొన్ని కీలక ఘట్టాలను తీసుకుని కట్ చేసిన ప్రోమో అది. ఈ ఎపిసోడ్ మొత్తం 180 దేశాల్లో ప్రసారం కానుంది. ఆయా దేశాల ప్రజలు సరికొత్త మోడీని చూస్తారని అంటూ బేర్ గ్రిల్స్ వ్యాఖ్యానించారు. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ఈ సాహసానికి పూనుకున్నారని ప్రశంసించారు. ఈ ఎపిసోడ్ ప్రసారమైన తరువాత ప్రజలకు అడ్వెంచర్ ట్రిప్ లపై మరింత ఆసక్తి కలుగుతుందని, వన్యజీవులను సంరక్షించాలనే బాధ్యత గుర్తుకు వస్తుందని అన్నారు. నిజానికి బేర్ గ్రిల్స్ కు రాజకీయ నాయకులతో ఇలాంటి ప్రత్యేక ఎపిసోడ్ లను చిత్రీకరించడం కొత్తేమీ కాదు. 2016లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతోనూ ఇదే తరహాలో ఓ ఎపిసోడ్ ను తీశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Prime Minister Narendra Modi is all set to appear on a special episode of popular wildlife show Man vs Wild with British presenter Bear Grylls. The program will be broadcast at 9 pm on August 12 on Discovery India. Grylls said that the global broadcast will see the “unknown side of PM Modi” as he ventures into Indian wilderness to create awareness about animal conservation. “People across 180 countries will get to see the unknown side of PM Narendra Modi as he ventures into Indian wilderness to create awareness about animal conservation & environmental change. Catch Man Vs Wild with PM Modi DiscoveryIN on August 12 9 pm,” he tweeted.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more