వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంలతో మోడీ సమావేశం: 27వ తేదీన కరోనా పరిస్థితులపై చర్చ, కేసులు పెరుగుతున్న క్రమంలో..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ సోమవారం సీఎంలతో కరోనా వైరస్ ప్రభావం, అన్ లాక్ 3.0 గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై.. చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆరోగ్య సేవలు, వ్యుహాలపై ముఖ్యమంత్రులతో మోడీ డిస్కస్ చేయబోతున్నారు.

 PM Modi to Hold Meeting with CMs on July 27th..

వరసగా మూడోరోజు కరోనా వైరస్ రికవరీ రికార్డు స్థాయిలో జరిగింది. 34 వేల పైచిలుకు మంది కోలుకోవడంతో 63.45 శాతంగా ఉంది అని కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. కానీ మరణాల శాతం మాత్రం 2.38కి పెరిగిందని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సీఎంలతో వరసగా సమావేశమవుతూ వస్తున్నారు. కరోనా మహమ్మరి కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిర్దేశం చేశారు.

Recommended Video

Nepal Communist Party లో సంక్షోభం, భారత్ వ్యతిరేక కుట్రలపై ఆగ్రహం

మార్చి 23వ తేదీన మొదటిసారి లాక్ డౌన్ విధించే ముందు సీఎంలతో సమావేశమయ్యారు. తర్వాత దశలవారీగా అభిప్రాయం తీసుకున్నారు. లాక్ డౌన్ 4.0 ముగిసేలోపు మే నెల చివరివారంలో అమిత్ షా కూడా సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. కేసులు పెరుగుతున్న క్రమంలో సీఎంలతో మోడీ ఇంటరాక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
Prime Minister Narendra Modi will hold a meeting with chief ministers of all the states on July 27 to discuss the coronavirus situation in the country and Unlock 3.0.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X