వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ అప్ డేట్: మరో 3 కంపెనీలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, పీఎంవో ట్వీట్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ స్టేజీ చివరి దశకు చేరుకుంది. శనివారం అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్‌లో ఆయా కంపెనీల వ్యాక్సిన్ గురించి క్షేత్రస్థాయిలో మోడీ అడిగి తెలుసుకున్నారు. ఇవాళ మరో మూడు కంపెనీలతో మోడీ వర్చువల్ విధానంలో ఇంటరాక్ట్ అవుతారని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

Recommended Video

Covid-19 Vaccine Development: PM Modi To Interact With 3 Teams Today | Oneindia Telugu

జెనొవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధులతో మోడీ మాట్లాడతారు. కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేస్తోన్న మూడు బృందాలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని పీఎంవో తెలిపింది. శనివారం అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లో భారత్ బయోటెక్, పుణెలో సీరం ఇనిస్టిట్యూట్‌ను మోడీ సందర్శించిన సంగతి తెలిసిందే.

PM Modi to interact with 3 teams involved in developing Covid-19 vaccine today

ఆ వెంటనే మరో మూడు వ్యాక్సిన్ అభివృధ్ది చేసే సంస్థలతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యూ ఇయర్‌లో వ్యాక్సిన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సీరం వ్యాక్సిన్‌ను ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అస్ట్రాజెనెకా డెవలప్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూలై వరకు 400 మిలియన్ డోసుల వరకు డెవలప్ చేస్తామని చైర్మన్ అదర్ పునావాలా తెలిపారు. నెలకు 50 నుంచి 60 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తామని పునావాలా తెలిపారు. జనవరి తర్వాత 100 మిలియన్ డోసులు ప్రొడక్ట్ చేస్తామని చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi on Monday will interact with three teams that are involved in developing a Covid-19 vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X