వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్లుండి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్న మోడీ- తొలిరోజు 3లక్షల మందికి టీకా

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఎల్లుండి ఉదయం కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రారంభించే అవకాశముంది. తొలిరోజు 3 లక్షల మంది బాధితులకు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి చేపట్టనున్న కరోనా వ్యాక్శినేషన్‌ భారీ డ్రైవ్‌ కోసం కేంద్రం సర్వం సిద్దం చేస్తోంది. ఈ నెల 16న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. అయితే వేదిక ఇంకా ఖరారు కాలేదు. తొలిరోజు మాత్రం 3 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించే అవకాశముందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పౌల్‌ ఎన్డీటీవీకి వెల్లడించారు. ఈ భారీ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్‌తో పాటు కేంద్రం, రాష్ట్రాల్లో నియమించిన టాస్క్‌ఫోర్స్‌లు పర్యవేక్షిస్తున్నాయి.

PM modi To Launch Vaccine Drive on January 16, Shots For 3 Lakh On Day 1

కేంద్రం ఇప్పటికే ప్లాన్‌ చేస్తున్న దాని ప్రకారం శనివారం రోజు దేశవ్యాప్తంగా 3000 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభం కాబోతోంది. ఒక్కో చోట వంద వ్యాక్సిన్‌ డోసులను అందిస్తారు. ఈ కార్యక్రమం ముందుకు సాగే కొద్దీ వ్యాక్సినేషన్‌ ప్రాంతాలను 5 వేలకు పెంచుతామని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు.

రాబోయే కొన్ని నెలల్లో అత్యంత తీవ్ర రిస్క్‌ కలిగిన 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వీరిలో వైద్యులు, ఆరోగ్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మాత్రం కేంద్రం ఉచితంగా వీటిని ఇవ్వబోతోంది. తొలిదశలో వ్యాక్సిన్ ఇచ్చే మిగతా వారికి మాత్రం ఇంకా ధర నిర్ణయించాల్సి ఉంది.

English summary
Prime Minister Narendra Modi will launch the nationwide Covid vaccination drive on Saturday and Some 3 lakh people will receive shots on the first day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X