వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే : హీరాబెన్ సమక్షంలో బర్త్ డే వేడుకలు, బంగారు కిరీటం బహుకరణ...

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ 69వ ఏట అడుగుపెట్టారు. తన పుట్టినరోజును మాతృమూర్తి హీరాబెన్ సమక్షంలో జరుపుకోవాలని భావించి .. నిన్న రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోడీకి గుజరాత్ సీఎం విజయ్ రుపానీ, తదితరులు ఘనస్వాగతం పలికారు. హ్యాపీ బర్త్ డే అంటూ నినాదాలు చేశారు. అక్కడినుంచి నేరుగా తన తల్లి హీరాబెన్ వద్దకెళ్లిపోయారు ప్రధాని మోడీ.

తల్లి ఆశీస్సులు ..

తల్లి ఆశీస్సులు ..

ఇవాళ ఉదయం తల్లి హీరాబెన్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు మోడీ. తర్వాత నర్మద జిల్లాలో పూజలు నిర్వహించారు. నమామీ దేవి నర్మద మహోత్సవ్ ఉత్సవాలను గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ కూడా నర్మద వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అంతకుముందు కెపాడియా పార్క్‌లో సఫారీ టూర్ కూడా చేశారు మోడీ.

సేవా కార్యక్రమాలు ..

మోడీ జన్మదినాన్ని పురష్కరించుకొని సేవా వారంగా బీజేపీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజులు వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ముఖ్య మద్దతుదారు అరవింద్ సింగ్ .. మోడీ పట్ల తన భక్తిని చాటుకొన్నారు. రెండోసారి మోడీ ప్రభుత్వం అధికారం చేపడితే సంకట హనుమాన్‌కు మొక్కు కోరుకున్నారు. తిరిగి మోడీ ప్రభుత్వం కొలువుదీరడంతో సంకట్ మోచన్ ఆలయంలోని హనుమాన్ విగ్రహానికి 1.25 కేజీల బంగారు కిరీటాన్ని బహుకరించారు.

హ్యాపీ బర్త్ డే మోడీ ..

మరోవైపు బీజేపీ నేత, ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ సోమవారం అర్ధరాత్రి ఇండియా గేట్ వద్ద నరేంద్ర మోడీ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు. ఆయురార్యోగాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

English summary
prime Minister Narendra Modi turns 69 on Tuesday and he has reached Ahmedabad to start the day with his mother. PM Modi arrived in Gujarat on Monday night and was received by a host of supporters and chief minister Vijay Rupani. PM Modi was greeted by a large number of supporters at the airport who were waiting to catch a glimpse of the Prime Minister. On Tuesday morning, PM Modi will be meeting his mother Hiraben early morning to seek her blessings and later perform a puja at the Narmada district of Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X