వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు: కరోనా పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు ఉపయోగపడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. అద్భుతమైన వ్యక్తంటూ నరేంద్ర మోడీని ప్రశంసించారు.

Recommended Video

Trump's U Turn, Praises Modi And India But India Will Do Everything With Humanity

ప్రధాని, భారత ప్రజలపై ట్రంప్ ప్రశంసలు..

అంతేగాక, అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ‘మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఇలాంటి సమయాలు మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా భాగస్వామ్యం ముందు కంటే మరింత బలోపేతమైంది. కొవిడ్-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటానికి తమవంతుగా భారత్ చేయగలిగినంత సాయం చేస్తుంది. కరోనాను కలిసి జయిస్తాం' అని మోడీ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు.

అంతకుముందు హెచ్చరికలు..

అంతకుముందు హెచ్చరికలు..

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉపయోగించే హైడ్రాక్సీ క్వోరోక్విన్ మాత్రలు అందించాలంటూ అమెరికా, బ్రెజిల్ సహా 30 కరోనా బాధిత దేశాలు భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. ఇక ట్రంప్.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతిపై భారత్ నిషేధం ఎత్తివేయకుంటే ఆంక్షలు తప్పవంటూ హెచ్చరించారు.

మానవతా దృక్పథంతో స్పందించిన భారత్..


కరోనా విస్తరిస్తున్న నేపథ్యం ప్రపంచ దేశాలకు తమవంతుగా సాయం చేయాలని ఉద్దేశంతో.. భారత్ తమ అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుకుని.. మిగిలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను కరోనా బాధిత దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే స్వరం మార్చిన ట్రంప్.. భారత్, భారత ప్రజలు, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు.

కరోనా కోరల్లో అమెరికా అతలాకుతలం..

కరోనా కోరల్లో అమెరికా అతలాకుతలం..


కాగా, అమెరికాలో కరోనా మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 15000 మంది మరణించారు. 5 లక్షల మందికిపైగా కరోనా బాధితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 40కిపైగా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. దేశంలోని 95 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే లక్షా 50వేల మంది కరోనా బారిన పడటం గమనార్హం. అమెరికాలో పెరుగుతున్న మరణాల నేపథ్యంలో ట్రంప్ నివారణ చర్యలకు ఉపక్రమించారు. భారత్ ముందే అప్రమత్తమైనప్పటికీ.. ట్రంప్ మాత్రం లాక్ డౌన్ విధంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ దేశంలో మరణాల సంఖ్య పెరుగుదలకు కారణమైనట్లు ఆరోపణలు వినిస్తున్నాయి.

English summary
Prime Minister Narendra Modi has said that India will do everything possible to help humanity's fight against Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X