వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలాం అన్న కాళ్లు మొక్కిన మోడీ, గీత గీసిన మరైకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

రామేశ్వరం: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సోదరుడు మొహమ్మద్ ముత్తు మీరా లెబ్బై మరైకర్ కాళ్లకు మొక్కారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు గురువారం జరిగాయి.

ఈ అంతిమ వేడుకలకు ప్రదాని నరేంద్ర మోడీ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోడీ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కలాం 99 ఏళ్ల అన్నయ్య మొహమ్మద్ ముత్తును పరామర్శించి, ఆయనకు పాదాభివందనం చేశారు.

కలాం అన్న మరైకర్‌ మల్లెపూలతో గీచిన గీత అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. తన అన్నే తన సర్వస్వమని, తనను ఓ తండ్రిలా పెంచి పెద్దజేసింది అన్నేనని, తన చదువుల కోసం ఆయన శ్రమ వర్ణించలేనిదంటూ కలాం పలుమార్లు మరైకర్‌ గురించి చెప్పారు.

PM Modi touches Kalam's brother's feet

కలాం విద్యాభ్యాసంలో ఉపాధ్యాయులది కీలకపాత్రే అయినప్పటికీ కలాంకు గీత చక్కగా గీయడాన్ని నేర్పించింది మాత్రం మరైకరే. మరైకర్‌కు ఆ రోజులు గుర్తుకొచ్చాయి. కళ్లెదుటే జీవం లేకుండా ఉన్న తమ్ముణ్ని చూసి కన్నీళ్లు ఆగలేదు. పక్కనే ఉన్న తెల్ల పువ్వులను తీసుకుని భౌతికకాయం ఎదుట నిటారుగా ఓ గీత గీశారు.

కలాం స్వగ్రామాన్ని చూడాలని, తన ఆత్మకథలో కలాం రాసుకున్న ఆ వీధులు, దేవాలయాలు, రైలు పట్టాలు, పంబన్ బ్రిడ్జి చూడాలని మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాంతో పని చేసిన వారి కోరిక. ఎవరైనా మీ ఊరికి తీసుకెళ్లమని అడిగితే 2016లో తీసుకెళ్తానని చెప్పేవారు కలాం.

అందుకు కారణం ఉంది. తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిన తన అన్నయ్యకు వందవ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని కలాం భావించారు. మరైకర్ 100వ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలనుకున్నారు. అందుకే ఆ వేడుకకు తీసుకెళ్తానని అందరికీ చెప్పేవారు. కలాం ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు.

English summary
PM Narendra Modi on Thursday met the family members of former president Dr APJ Abdul Kalam. He touched the feet of Kalam's 99 year old elder brother Mohammad Muthu Meera Lebbai Maraicker and spent some time commiserating with him and other members of the family over their loss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X