ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని: యువతతో చిట్‌చాట్ కోసమేనంటూ మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెట్రో రైలులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో ముచ్చటించి సందడి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో జరుగుతున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రధాని మోడీ శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్ళేందుకు ప్రధాని ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.
ఓ సామాన్యుడిలా ఆయన మిగిలిన ప్రయాణికులతోపాటు మెట్రో రైలులో కూర్చుని ప్రయాణించారు. విద్యార్థులు, తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. బీజేపీ కూడా మోడీ మెట్రో రైలులో ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, 1922లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ప్రకారం ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University)ని స్థాపించారు. దీన్ని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(UGC) ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించింది. 2022 నాటికి ఈ విశ్వవిద్యాలయానికి వందేళ్లు పూర్తవడంతో గత ఏడాది మే 1వ తేదీన శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఏడాదిపాటు జరిగిన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి.
PM Shri @narendramodi takes Delhi Metro to attend the centenary celebrations of Delhi University. pic.twitter.com/h39YnjMUoc
— BJP (@BJP4India) June 30, 2023
ఈ ముగింపు ఉత్సవాలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో యూనివర్సిటీ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మోడీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో తన ప్రయాణ ఫోటోలను కూడా పంచుకున్నారు. యువత తన తోటి ప్రయాణీకులుగా ఉన్నందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈవెంట్‌లో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అనుభవం గురించి చెప్పాడు.
PM Shri @narendramodi interacts with passengers in Delhi Metro during his ride to Delhi University. pic.twitter.com/NHYZlSUrYb
— BJP (@BJP4India) June 30, 2023
డీయూలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. మెట్రోలో ప్రయాణించిన అనుభవాన్ని పంచుకున్నారు. "మీరు సహోద్యోగులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు క్యాంపస్‌కి రావడం మరింత ఆనందంగా ఉంటుంది. ఇద్దరు స్నేహితులు కలిసి సూర్యుని క్రింద ఉన్న ప్రతిదాని గురించి.. ఇజ్రాయెల్ నుంచి చంద్రుని వరకు కబుర్లు చెప్పుకుంటున్నారు. కౌన్సి ఫిల్మ్ దేఖీ? (మీరు ఏ సినిమా చూశారు) OTT పర్ వో సిరీస్ అచీ హై? (ఇది OTTలో చూడదగ్గ సిరీస్) వో వాలీ రీల్ దేఖీ యా నహీ దేఖీ? (ఇన్‌స్టాగ్రామ్ రీల్ ట్రెండ్‌ని మీరు చూశారా) కాబట్టి ఈ రోజు, నేను నా యువ స్నేహితులతో చాట్ చేయడానికి ఢిల్లీ మెట్రోను ఆశ్రయించాను" అని ప్రధాని మోడీ తెలిపారు.












Click it and Unblock the Notifications