వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతాజీ రహస్య ఫైళ్లను విడుదల చేసిన మోడీ, ఉద్వేగం

|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్య ఫైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం విడుదల చేశారు. నేతాజీ జయంతి సందర్భంగా రహస్య ఫైళ్ల డిజిటల్‌ 100 ప్రతులను ప్రధాని విడుదల చేశారు. కార్యక్రమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బోస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బోస్ కుటుంబ సభ్యులను ప్రధాని పలకరించారు. పైళ్లను విడుదల చేసిన అనంతరం కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. అటు పశ్చిమబెంగాల్ లో బీజేపీ సంబరాలు చేసింది. కోలకతాలో బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కాగా, నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు ఈ పత్రాల్లో వెల్లడైంది.

గత అక్టోబర్‌లో నేతాజీ కుటుంబసభ్యులను కలిసిన సందర్భంగా నేతాజీ రహస్య ఫైళ్లను విడుదల చేస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే శనివారం ఫైళ్లను విడుదల చేశారు. కాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసింది.

PM Modi unveils 100 declassified files on Subhash Chandra Bose

నేతాజీ విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు తాజాగా వెల్లడైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. బోస్ మిస్టరీ ఛేదించేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో వీటిని బయటపెట్టింది. నేతాజీ 1945, ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో గాయపడిన నేతాజీ అదే రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించింది.

English summary
PM Modi, in his meeting with members of Subhash Chandra Bose family on October 14, last year, had announced that the government would declassify the files and make them accessible to public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X