వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని సమీక్ష .. తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల సీఎంలతో

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 45,000 మందికి పైగా మరణాలతో ఇండియాలో కోవిడ్ -19 కేసులు 2.26 మిలియన్లకు మించి పెరిగాయి. ఈ సమయంలో వివిధ రాష్ట్రాల్లో కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

కరోనా బాధితుల కోసం ఐసీయూగా షారూక్ ఖాన్ ఆఫీస్ సిద్ధం .. దాతృత్వం చాటుకున్న రియల్ హీరోకరోనా బాధితుల కోసం ఐసీయూగా షారూక్ ఖాన్ ఆఫీస్ సిద్ధం .. దాతృత్వం చాటుకున్న రియల్ హీరో

కరోనా నేపధ్యంలో జరుగుతున్న ఏడవ సమావేశం

కరోనా నేపధ్యంలో జరుగుతున్న ఏడవ సమావేశం

ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారిపై ముఖ్యమంత్రులతో ఇప్పటివరకు ప్రధాని నిర్వహిస్తున్న ఏడవ సమావేశం ఇది. కరోనావైరస్ పరిస్థితిపై చర్చించడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ చివరి సమావేశం జూన్లో జరిగింది.

కేసులు పెరుగుతున్న వేళ ... ప్రధాని సమావేశంపై ఆసక్తి

కేసులు పెరుగుతున్న వేళ ... ప్రధాని సమావేశంపై ఆసక్తి

ఇక ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌లో కరోనా కేసులు రోజురోజకు పెరిగిపోతున్న స‌మ‌యంలో నిర్వ‌హిస్తోన్న ఈ స‌మావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇవాళ 10 రాష్ట్రాల‌కు చెందిన సీఎంల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు ప్ర‌ధాని నరేంద్ర మోడీతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చెప్తారు, ఏం చర్చిస్తారు అన్నది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాలలో కరోనా పరిస్థితులు, కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, ఇప్పటివరకు నమోదైన కేసులు సహా పలు అంశాలపై ప్ర‌ధాని మోడీ, ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.

తెలుగు రాష్ట్రాల సీఎం లు ప్రధానితో ఏం చెప్తారో అన్న ఆసక్తి

తెలుగు రాష్ట్రాల సీఎం లు ప్రధానితో ఏం చెప్తారో అన్న ఆసక్తి

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ సీఎంలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తున్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీతో వారి సంభాషణ, మోడీ వారికి ఏం చెప్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొంటున్నారు.

Recommended Video

వైజాగ్, కొండపల్లి లో Ammonium Nitrate నిల్వల పై అశ్రద్ద వద్దు | Pawan Kalyan | Lebanon | Beirut
దేశంలో కరోనా పంజా విసురుతున్న టాప్ త్రీ రాష్ట్రాలివే

దేశంలో కరోనా పంజా విసురుతున్న టాప్ త్రీ రాష్ట్రాలివే

దేశంలో కరోనా విపరీతంగా పెరిగిన రాష్ట్రాలలో మహారాష్ట్ర దేశంలోనే అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా కొనసాగుతోంది, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ తరువాత ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్లలో కూడా గత 24 గంటల్లో అత్యధిక కరోనావైరస్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఇక ఈ రాష్ట్రాలలో కరోనా కట్టడికి కేంద్రం నుండి ఎలాంటి మార్గదర్శకాలను ఇస్తారో తెలియాల్సి ఉంది .

English summary
The Prime Minister Narendra modi holding a video conference with the chief ministers of Andhra Pradesh, Karnataka, Tamil Nadu, West Bengal, Maharashtra, Punjab, Bihar, Gujarat, Telangana, Uttar Pradesh to review the coronavirus situation in the regions even as the country’s Covid-19 tally surged beyond the 2.26-million mark, including more than 45,000 deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X