వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా భారత్ మంచి పని చేసింది: నాయర్, ప్రధాని మోడీ కోరుకునేది అదే: శృతి సింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: భారత ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వకుండా మంచి పని చేసిందని కేకేఆర్ ఇండియా (ఇది లీడింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ) సీఈవో సంజయ్ నాయర్ అన్నారు. ద్రవ్యోల్బణం అని భావిస్తే ప్రజలు తమ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాలపై ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ద్రవ్యోల్భణం అంచనాలు ఎక్కువగా ఉంటే డబ్బు రూపంలో రుణాలు చెడు ఏమీ కాదన్నారు.

ఎగుమతులు ఎంతో కీలకమని చెప్పారు. ప్రతి సెక్టార్ అండర్ డెవలప్‌లో ఉందని, దానికి సమయం పడుతుందన్నారు. సంక్షేమ పథకాలను ఎక్కువగా ప్రోత్సహించకపోవడం ద్వారా ప్రభుత్వం మంచి పని చేస్తోందని చెప్పారు. బ్యాంకుల ప్రయివేటీకరణపై ఆలోచించాలన్నారు.

PM Modi wants young Indians to be job makers, not seekers: Shruti Singh

రాకేష్ భారతి మిట్టల్ మాట్లాడుతూ.. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా వృద్ధిలో భాగంగా ఉండాలన్నారు. భారత ఎఫ్‌డీఐ ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుత పాలసీ అన్నారు. భారత ప్రభుత్వం ఓ వైపు ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తోందని, మరోవైపు చాలామంది స్వదేశీ వస్తు రక్షణ విధానం గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత ఉత్సాహాన్ని పెంచిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభత్వాలు అవసరాన్ని మించి ముందుకు సాగుతున్నాయన్నారు. జీఎస్టీ అమలు ప్రపంచంలో అత్యంత వేగంగా ఉందని రాకేష్ మిట్టల్ చెప్పారు.

డిప్యూటీ సెక్రటరీ శృతి సింగ్ మాట్లాడుతూ.. 2025 నాటికి భారత దేశంలో సగటు వయస్సు 29గా ఉంటుందని, అప్పుడు అది కొత్త భారత్ ఆవిర్భవిస్తుందన్నారు. భారత ఎకానమీ 7.4 శాతం వరకు పెరుగుతోందన్నారు. భారత్‌ది థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ ఎకానమీ అన్నారు.

యువత ఉద్యోగం వెతుక్కునే వారుగా కాకుండా, ఉద్యోగం ఇచ్చేవారిగా తయారు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారని శృతి చెప్పారు. మేకిన్ ఇండియా డిఫెన్స్, మెడిసిన్, ఏరో స్పేస్‌ను కూడా టచ్ చేసిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత్ ఒక్క ఏడాదిలోనే 30 స్థానాలు ఎగబాకిందని తెలిపారు.

English summary
"PM Modi wants young Indians to be job makers, not seekers. Make in India touches defence, aerospace, medicine. Ease of Doing Business report showed that India jumped 30 places in one year," says Shruti Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X