• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నరేంద్ర మోదీ: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ పేరెత్తకుండా, ఆ దేశానికి భారత ప్రధాని ఏమని వార్నింగ్ ఇచ్చారు?

By BBC News తెలుగు
|
Google Oneindia TeluguNews
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో నరేంద్ర మోదీ ప్రసంగం

భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. అఫ్గానిస్తాన్ భూభాగాన్ని తీవ్రవాదాన్ని వ్యాప్తి చెందించేందుకు వాడకుండా చూడాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు.

ఇంకా మోదీ ఏమన్నారంటే..

''తీవ్రవాదాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్న వారు ఒక విషయాన్ని గుర్తించాలి. అదేంటంటే.. తీవ్రవాదం వాళ్లకు కూడా అంతే ప్రమాదకరం. అఫ్గానిస్తాన్ భూభాగాన్ని తీవ్రవాద దాడుల కోసం కానీ, తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకు గానీ ఉపయోగించుకోకుండా చూడాలి.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న సున్నితమైన పరిస్థితులను కొన్ని దేశాలు తమ స్వార్థం కోసం, ఒక అస్త్రంగా వాడుకోకుండా చూడాలి.

అఫ్గానిస్తాన్ ప్రజలు, మహిళలు, చిన్నారులు, మైనార్టీలకు సహాయం అవసరం. ఈ మేరకు మనమంతా ముందుకురావాలి, సహాయం అందించాలి.’’

"ప్రపంచమంతా గత 100 సంవత్సరాలలో ఎన్నడూ చూడని మహమ్మారిని గత సంవత్సరంన్నర కాలంగా ఎదుర్కొంటోంది. కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నేను నివాళి సమర్పిస్తున్నాను. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియచేస్తున్నాను" అని ప్రధాని అన్నారు.

https://www.youtube.com/watch?v=I7hSI38-8WA

మోదీ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు:

"ప్రజాస్వామ్యానికి మాతృదేశంగా పిలిచే దేశానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రజాస్వామ్యానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆగస్టు 15న భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. మా దేశంలో నెలకొన్న భిన్నత్వం, దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మా దేశ ప్రత్యేకతలు. దేశంలో అనేక భాషలు, వందలాది మాండలికాలు, విభిన్నమైన జీవన శైలులు, వంటకాలు ఉన్నాయి. వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యానికి భారతదేశం ఒక ఉత్తమమైన ఉదాహరణగా నిలుస్తుంది".

"గుజరాత్ కు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేశాను. భారతదేశానికి గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రిగా ఉన్నాను. నేను 20 సంవత్సరాలుగా దేశ ప్రజలకు సేవ చేస్తున్నాను. ప్రజాస్వామ్యం పని చేస్తుంది, పని చేసింది అని నా స్వానుభవం ద్వారా చెప్పగలను".

వ్యాక్సీన్ గురించి మోదీ ఏమన్నారు?

"ఈ రోజు పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ్ జయంతి. ఆయన స్వీయ ప్రయాణం నుంచి సమాజం కోసం చేసే ప్రయాణ దర్శనం గురించి మాట్లాడిన వ్యక్తి.

సమాజాన్ని, దేశాన్ని, మానవ జాతిని విశాల దృక్పథం వైపు నడిపించడమే ఆయన ఆలోచన ముఖ్య ఉద్దేశం.

ఈ ఆలోచనను అంత్యోదయ ఉద్యమానికి అంకితం చేశారు. ప్రస్తుత కాలంలో అంత్యోదయ అంటే ఎవరినీ వెనుక వదిలిపెట్టేది లేదని అర్ధం. ఇదే స్పూర్తితో అన్ని రంగాలను అనుసంధానపరిచే, సమాన అభివృద్ధి జరిగే మార్గం వైపు భారతదేశం పయనిస్తోంది".

"అభివృద్ధి అందరినీ కలుపుకుంటూ, అన్నిటినీ సమైక్యపర్చుకుంటూ, విస్తృత పరుచుకుంటూ వెళ్ళాలి. అదే మా ప్రాధాన్యత. కలుషిత నీటి సమస్య ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పేద, అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ ఉంది. భారతదేశంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి 170 మిలియన్ గృహాలకు మంచి నీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. కొళాయిల ద్వారా శుభ్రమైన నీరు అందించేందుకు భారీగా ప్రచారం నిర్వహిస్తున్నాం".

"ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతీ ఆరవ వ్యక్తి భారతీయులే. భారతీయులు అభివృద్ధి చెందితే, ప్రపంచ అభివృద్ధి కూడా మరింత వృద్ధి చెందుతుంది. భారతదేశం అభివృద్ధి చెందితే, ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది. భారతదేశం మెరుగు పడితే, ప్రపంచం మారుతుంది".

https://www.youtube.com/watch?v=N9Py-emYOoE

"సేవా పరమో ధర్మ" అనే సిద్ధాంతం పై నడిచే భారతదేశం వనరులు తక్కువగా ఉన్నప్పటికీ వ్యాక్సిన్ల ఉత్పత్తి, అభివృద్ధి చేసేందుకు అంకితమయింది. భారతదేశం తొలి డి ఎన్ ఏ వ్యాక్సీన్‌ను తయారు చేసిందని నేనీ రోజు యూఎన్ జనరల్ అసెంబ్లీకి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ వ్యాక్సీన్ ను 12 సంవత్సరాలు దాటిన వారందరికీ వేయవచ్చు.

"మానవ సమాజం పై ఉన్న బాధ్యతను గ్రహించి ప్రపంచంలో వ్యాక్సిన్లు అవసరమైన వారందరికీ భారతదేశం వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సీన్ ఉత్పత్తిదారులను భారతదేశం వచ్చి ఉత్పత్తి చేయమని ఆహ్వానిస్తున్నాను.

"ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మరింత విభిన్నంగా ఉండాలని కరోనా మహమ్మారి నేర్పింది. ఇందు కోసం గ్లోబల్ వేల్యూ చెయిన్ ను మరింత విస్తృత పరచడం అవసరం. దీనిని స్ఫూర్తిగా తీసుకునే స్వయం సమృద్ధితో కూడిన భారతదేశ ప్రచారం జరుగుతోంది.

"ప్రస్తుతం, ప్రపంచంలో వెనుకబాటు ఆలోచనా ధోరణి, తీవ్రవాదం పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా అభివృద్ధికి సైన్సు ఆధారిత, పురోగమన ఆలోచనా ధోరణిని ఆధారంగా చేసుకోవాలి.

"ఈ రోజు ఐక్యరాజ్య సమితిలో చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలను వాతావరణ సమస్యలు, కోవిడ్ సమయంలో కూడా ఎదుర్కొన్నాం. ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్న ప్రాక్సీ యుద్ధం, అఫ్గానిస్తాన్ సంక్షోభం ఈ ప్రశ్నలను మరింత ఎక్కువగా అడిగేలా చేస్తున్నాయి.

"కోవిడ్ పుట్టుక గురించి దశాబ్దాల పాటు చేసిన కృషిని కొన్ని సంస్థలు ఈజ్ ఆఫ్ బిజినెస్ ర్యాంకింగుల ద్వారా నాశనం చేశాయి".

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో నరేంద్ర మోదీ ప్రసంగం

"మహా సముద్రాలు కూడా మన వారసత్వ సంపదే. మన సముద్ర వనరులను దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. అంతర్జాతీయ వాణిజ్యానికి మహా సముద్రాలే జీవనాడులు. నియమాలతో కూడిన ప్రపంచం కోసం ప్రపంచ నాయకులంతా ఒకే తాటి పై నడవాలి.

"అంతర్జాతీయ నియమాలు, అంతర్జాతీయ న్యాయం, అంతర్జాతీయ విలువలను సంరక్షించడానికి ఐక్యరాజ్యసమితిని ఎప్పటికప్పుడు బలపరచడం చాలా ముఖ్యం.

కొన్ని శతాబ్దాల క్రితం "కలతి క్రమత్ కాల్ ఏవ ఫలం పిబతి' ఏదైనా పనిని సరైన రీతిలో నిర్వహించని పక్షంలో ఆ పని వల్ల చేకూరిన విజయాన్ని సమయం చంపేస్తుంది" అని చాణక్యుడు చెప్పారు. ఐక్యరాజ్య సమితి పాత్ర కు ప్రాధాన్యత ఉండాలంటే, అది తన ప్రభావాన్ని పెంచుకుని నమ్మకాన్ని పెంచుకోగలగాలి" అని మోదీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
PM Modi warns Pak without taking its name directly at UNGA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X