వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ అనుమతి లేకుండానే ప్రధాని మోడీ ఈ నిర్ణయం చేసేశారు: ఆర్టీఐ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: 2016 నవంబర్ 8... ఈ తేదీ ప్రతి భారతీయుడికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ రోజే రూ. 500 నోట్లు, నూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో యావత్ భారత దేశం రోడ్డుపై కొచ్చింది. ఎటు చూసినా ఏటీఎంల ముందు కిలోమీటర్ల మేరా క్యూలు దర్శనమిచ్చాయి. బ్యాంకుల ముందు కూడా పెద్ద ఎత్తున లైన్లు కనిపించాయి. తమ డబ్బును తాము తీసుకునేందుకు కూడా చాలా నియమనిబంధనలు అడ్డొచ్చాయి. ఇదిలా ఉంటే నోట్ల రద్దుకు సంబంధించి కొత్త విషయం ఒకటి బయటపడింది. ఆర్బీఐ అధికారికంగా అనుమతి ఇవ్వకుండానే పెద్ద నోట్లు రద్దు జరిగిందని ఆర్టీఐ ద్వారా బయటకు పొక్కింది.

PM Modi went ahead with demonetisation before RBI’s formal approval: RTI

నోట్లు రద్దు ప్రకటనకు రెండున్నర గంటల ముందు నాటి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో ఊర్జిత్ పటేల్ మోడీతో ఎన్ని నిమిషాలు పాటు సమావేశం అయ్యారనే విషయాన్ని తెలుపుతూ ఐదు వారాల తర్వాత అంటే డిసెంబర్ 15,2016 సంతకం చేశారు. నవంబర్ 6వ తేదీ ఆర్బీఐ గవర్నర్ , డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. పెద్దనోట్ల రద్దును వారు స్వాగతించారు. అంతేకాదు స్వల్పకాలం పాటు కొంత ఇబ్బందులు ఉంటాయని అది జీడీపీ పై ప్రభావం చూపుతుందని కూడా చెప్పారు. అప్పటి ఆర్బీఐ బోర్డులో ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఒక డైరెక్టర్‌గా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంకు చెక్ పెట్టొచ్చని చెప్పారు.

పోటీ చేయడం లేదు...ప్రచారానికే పరిమితం కానున్న ప్రియాంకాగాంధీ..?పోటీ చేయడం లేదు...ప్రచారానికే పరిమితం కానున్న ప్రియాంకాగాంధీ..?

ఇక పెద్దనోట్ల ద్వారా అంటే రూ.500 నోట్లు, రూ.1000నోట్లు వినియోగించి బిల్లులు ఎంతమేరకు చెల్లించారో అనేదానిపై కూడా సమాచారం లేదని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు 2017-18 వార్షిక నివేదికను 29ఆగష్టు 2018లో విడుదల చేసింది ఆర్బీఐ. ఈ రిపోర్టులో రద్దయిన పెద్ద నోట్లు అన్నీ బ్యాంకులకు చేరుకున్నాయని చెప్పింది. రూ.15.31 లక్షల కోట్లు రూ. 500, రూ.1000 నోట్ల రూపంలో వచ్చాయని పేర్కొంది. అంటే నవంబర్ 8,2016 నాటికి వ్యవస్థలో 99.3శాతం లేదా రూ.15.417 లక్షల కోట్లు పెద్ద నోట్ల రూపంలో చలామణిలో ఉన్నాయి. అంటే ఆర్బీఐకి ఇంకా రూ. 10720 కోట్లు రావాల్సి ఉంది. నాడు ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆర్బీఐ వ్యవహరించిందని... ప్రధాని తీసుకున్న తుగ్లక్ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్.

English summary
The demonetisation of Rs 500 and Rs 1,000 notes, which saw 86 per cent of high-value currency going out of circulation, was announced by Prime Minister Narendra Modi on November 8, 2016, even before formal approval by the RBI central board, an RTI query has revealed. While the Urjit Patel-led RBI board had met just two-and-a-half hours before Modi’s announcement, the minutes of the meeting were signed by the RBI governor five weeks later on December 15, 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X