వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు ఒకే వేదికపై పీఎం మోడీ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ? .. ఏం జరుగుతుందో ఉత్కంఠ !!

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లు ఇప్పుడు ఉప్పు, నిప్పులా రగిలిపోతున్నారు. గత ఎన్నికల ముందు నుండీ బీజేపీపై నిప్పులవర్షం కురిపిస్తున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ . ఇక ఇటీవల సీఏఏ, ఎన్నార్సీ లను పశ్చిమ బెంగాల్ లో అమలు చేసేది లేదంటూ తేల్చి చెప్పిన ఆమె సీఏఏ కు వ్యతిరేకంగా ఆందోళనల బాట పట్టారు. ఇక ఈ నేపధ్యంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ, మమతా బెనర్జీలు ఒకే వేదికపై కనపడతారా ? అన్నది పశ్చిమ బెంగాల్ లో ఆసక్తుకర చర్చకు కారణం అవుతుంది .

మమతా సర్కార్ కు మోడీ మార్క్ షాక్: గణతంత్ర దినోత్సవం వేడుకల్లో.. !మమతా సర్కార్ కు మోడీ మార్క్ షాక్: గణతంత్ర దినోత్సవం వేడుకల్లో.. !

 కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న పీఎం మోడీ, సీఎం మమతలు

కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న పీఎం మోడీ, సీఎం మమతలు

పౌరసత్వ చట్టంలో ఇటీవలి మార్పులకు వ్యతిరేకంగా విస్తృత నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదిక పంచుకుంటారా ? ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరవుతారా లేదా? అనే దానిపై ఎటువంటి నిర్ధారణ లేదు. అయితే ఈ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించిందీ లేదు .

మోడీ పాల్గొనే కార్యక్రమంలో మమత పాల్గొంటారా ? ఆసక్తికర చర్చ

మోడీ పాల్గొనే కార్యక్రమంలో మమత పాల్గొంటారా ? ఆసక్తికర చర్చ


జనవరి 11 నుంచి ప్రధాని మోదీ రెండు రోజుల కోల్‌కతా పర్యటనలో ఉంటారు మరియు జనవరి 12 న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కోప్టి) యొక్క 150 వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీని కూడా ఆహ్వానించినట్లు కోప్ట్ వర్గాలు తెలిపాయి.కానీ ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరవుతారా అనే దానిపై టిఎంసి నాయకులకే అంతు చిక్కని ప్రశ్నగా మారింది .పౌరసత్వం (సవరణ) చట్టం [సిఎఎ] కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లో ప్రారంభించిన నిరసనల తీవ్రతతో, ప్రస్తుతం పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది.

గత ఎన్నికల ముందు నుండీ బీజేపీ సర్కార్ పై రగిలిపోతున్న మమత

గత ఎన్నికల ముందు నుండీ బీజేపీ సర్కార్ పై రగిలిపోతున్న మమత

రాష్ట్ర (టిఎంసి) ప్రభుత్వం బహిరంగంగా సీఏఏ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పింది. ఇక ఇదే సమయంలో రెండు పార్టీల అగ్ర నాయకులు ఒకే వేదిక మీదకు వస్తారా ?రారా? అన్నది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి), రాష్ట్రంలో టిఎంసి ప్రధాన పోటీదారుగా తలపడినప్పటి నుండి, ప్రధాని మోడీ మరియు మమతా బెనర్జీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనూ కలిసి భాగస్వామ్యం తీసుకోలేదు. ఇక రేపు జరగనున్న కార్యక్రమంలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కావాల్సి ఉంది. అలాగే, ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా పాల్గొనాల్సి ఉన్నా ఏం జరుగుతుందో సర్వత్రా ఉత్కంఠనే .

English summary
Amid the wide-spread protests against recent changes in the citizenship law, the prospect of West Bengal Chief Minister Mamta Banerjee sharing dias with Prime Minister Narendra Modi during the 150th anniversary function of Kolkota Port Trust in Kolkata on Sunday remained uncertain .here was neither any confirmation nor denial on whether Mamta Banerjee would attend the programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X