వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీ పేదలకేం చేయరు.. ఆయనకే ఓటేయాలి: కర్ణాటక బీజేపీ ప్రచారంలో నోరుజారిన ట్రాన్స్‌లేటర్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

మోదీ వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుంది : అమిత్ షా ట్రాన్స్‌లేటర్

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని కలలు కంటున్న బీజేపీ నేతలు చేసిన, చేస్తున్న పొరపాట్లు పతాక శీర్షికలకు ఎక్కుతూనే ఉన్నాయి. మరోసారి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలను కన్నడంలో భిన్నంగా ట్రాన్స్ లేట్ చేసిన ఘటన గురువారం జరిగింది. దవణగిరె జిల్లాలో జరిగిన సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన ప్రహ్లాద్ జోషి ఇలా తర్జుమా చేశారు. 'ప్రధాని నరేంద్రమోదీ దళితులు, పేదలు, బలహీన వర్గాల వారికి ఏమీ చేయరు. ఆయన వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుంది. దయచేసి ఆయనకు ఓటేయండి' అని అమిత్ షా అన్నారని కన్నడ భాషలో చెప్పారు.

సిద్దరామయ్యకు బదులు యెడ్యూరప్పను ఎన్నుకోమన్న అమిత్ షాఇటీవల యెడ్యూరప్ప అత్యంత అవినీతి పరుడని నోరు జారిన అమిత్ షావాస్తవంగా అమిత్ షా ఏమన్నారంటే.. 'సిద్దరామయ్య ప్రభుత్వం కర్ణాటకను అభివ్రుద్ధి చేయదు. మీరు ప్రధాని మోదీ పట్ల విశ్వాసం ఉంచి బీఎస్ యెడ్యూరప్పకు ఓటేయండి. మేం కర్ణాటక రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం' అని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారేం కాదు. కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే నిర్వహించిన మీడియా సమావేశంలో బీఎస్ యెడ్యూరప్పను పెద్ద అవినీతి పరుడని అభివర్ణించారు.

 ఒకటి తర్వాత మరొకటి.. వరుసగా రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఇలా

ఒకటి తర్వాత మరొకటి.. వరుసగా రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఇలా

బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఒకనాడు గుజరాత్.. తదుపరి 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక పార్లమెంట్ సీట్లు.. తర్వాత ఒకటి వెంట మరొకటి దాదాపు రాష్ట్రాన్ని ‘కమలం' ఖాతాలో పడవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడం వెనుక కఠినమైన అమిత్ షా వ్యూహం, రాజకీయ చతురత ఉన్నాయన్న సంగతి రాజకీయ విశ్లేషకులు అందరికీ తెలిసిందే. మరో అమిత్ మాల్వియా బీజేపీలో యువ నాయకుడు.. పార్టీ ఐటీ సెల్ ఇన్‌చార్జీగా అడుగడుగునా పార్టీ విధానాలను, సిద్ధాంతాలను వ్యూహాత్మకంగా యావత్ కోట్ల మంది భారతీయుల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు అమిత్ మాల్వియా.

 ఒకటి తర్వాత మరొకటి.. వరుసగా రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఇలా

ఒకటి తర్వాత మరొకటి.. వరుసగా రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఇలా

బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఒకనాడు గుజరాత్.. తదుపరి 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక పార్లమెంట్ సీట్లు.. తర్వాత ఒకటి వెంట మరొకటి దాదాపు రాష్ట్రాన్ని ‘కమలం' ఖాతాలో పడవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడం వెనుక కఠినమైన అమిత్ షా వ్యూహం, రాజకీయ చతురత ఉన్నాయన్న సంగతి రాజకీయ విశ్లేషకులు అందరికీ తెలిసిందే. మరో అమిత్ మాల్వియా బీజేపీలో యువ నాయకుడు.. పార్టీ ఐటీ సెల్ ఇన్‌చార్జీగా అడుగడుగునా పార్టీ విధానాలను, సిద్ధాంతాలను వ్యూహాత్మకంగా యావత్ కోట్ల మంది భారతీయుల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు అమిత్ మాల్వియా.

ఈసీకి ముందే కర్ణాటక ఎన్నికల తేదీలు ట్వీట్ చేసిన అమిత్ మాల్వియా

ఈసీకి ముందే కర్ణాటక ఎన్నికల తేదీలు ట్వీట్ చేసిన అమిత్ మాల్వియా

ఇటు అమిత్ షా.. అటు అమిత్ మాల్వియా చేదోడువాదోడుగా నిలవడం వల్లే ప్రధాని నరేంద్రమోదీ అందోళనలకు అతీతంగా దేశ పాలన సాగిస్తున్నారు. కానీ ఈ అమిత్‌ల ద్వయంలో ఒకరు మాట జారారు. మరొకరు కట్టు దప్పారు. కానీ, రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాల్వియా అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తూ ‘ఫలానా తేదీల్లో పోలింగ్ జరుగుతుందని తన ట్విట్టర్ ద్వారా' లీక్ చేయడం వివాదాస్పదమైంది.

కౌంటింగ్ తేదీని తప్పుగా పేర్కొన్న అమిత్ మాల్వియా

కౌంటింగ్ తేదీని తప్పుగా పేర్కొన్న అమిత్ మాల్వియా

బీజేపీ ఐటీ సెల్ ఇన్ చార్జి అమిత్ మాల్వియా ‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేసిన' 15 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ దేశ రాజధాని హస్తిన వేదికగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో జర్నలిస్టులు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ముందు ప్రస్తావించడం గమనార్హం. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రమైన అంశంగా పరిణమించింది. దీనిపై విచారణకు ఆదేశించింది ఎన్నికల సంఘం. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇందులో అమిత్ మాల్వియా ఎన్నికల కౌంటింగ్ తేదీని పేర్కొనడం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఊరటనిచ్చింది.

అమిత్ మాల్వియాను తప్పుబట్టిన కేంద్రమంత్రి నక్వీ

అమిత్ మాల్వియాను తప్పుబట్టిన కేంద్రమంత్రి నక్వీ

224 స్థానాల కర్ణాటక అసెంబ్లీకి మే 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన కౌంటింగ్ జరుగనున్నదని ఎన్నికల సంఘం ప్రకటించింది. తన ట్వీట్‌పై విమర్శలు హోరెత్తడంతో అమిత్ మాల్వియా, కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జి శ్రీవత్స బీ కూడా అంతకుముందే ఎన్నికల తేదీలపై తమ ట్వీట్లను తొలిగించారు. వారిద్దరూ టెలివిజన్లలో వచ్చిన వార్తల ఆధారంగా ట్వీట్లు చేశామని సమర్థించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును పర్యవేక్షిస్తూ నియంత్రిస్తున్న బీజేపీ ‘సూపర్ ఎలక్షన్ కమిషన్'గా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా మండిపడ్డారు. ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతున్నదని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ తమ ఐటీ సెల్ ఇన్‌చార్జీ అమిత్.. ఇలా కర్ణాటక ఎన్నికల తేదీలు ట్వీట్ చేయకుండాల్సింది' అని వ్యాఖ్యానించారు.

తప్పు తెలుసుకుని వివరణ ఇవ్వడానికి అమిత్ షా ప్రయత్నం

తప్పు తెలుసుకుని వివరణ ఇవ్వడానికి అమిత్ షా ప్రయత్నం

అమిత్ మాల్వియాతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మరో పొరపాటు చేశారు. ఒక ఎన్నికల బహిరంగసభలో మాట్లాడుతూ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించబోయి గత బీఎస్ యెడ్యూరప్ప సారథ్యంలోని ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. కానీ సభలో పక్కనే ఉన్న పార్టీ నేతలు పొరపాటు సరిదిద్దేందుకు ప్రయత్నించారు. దీంతో సిద్దరామయ్య సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం అవినీతి మయం అని అమిత్ షా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు.

లోకాయుక్త నివేదిక వల్లే సీఎం పదవికి యెడ్యూరప్ప రాజీనామా

లోకాయుక్త నివేదిక వల్లే సీఎం పదవికి యెడ్యూరప్ప రాజీనామా

కానీ అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ వెంటనే కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. మొత్తానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిజం అంగీకరించారని పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. 75 ఏళ్ల బీజేపీ నేత యెడ్యూరప్ప హయాంలో అవినీతి జరిగిందని 2011 ఆగస్టులో నాటి కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె పేర్కొన్నారు. ఆ నివేదిక వల్లే యెడ్యూరప్ప తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అమిత్ ద్వయంచేసిన పొరపాట్లతో కన్నడ నేలపై అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని కమలనాథులు పెట్టుకున్నఅడియాసలవుతాయా? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
It seems the Bharatiya Janata Party's campaign in the election-bound Karnataka is making headlines for all the wrong reasons. The party's president Amit Shah was caught in a fix today, thanks to a translator who twisted the BJP chief's words.While Shah was addressing a BJP rally in Challkere of Karnataka's Devanagiri district where, according to the translator Prahlad Joshi's version, he said, "PM Narendra Modi will not do anything for Dalits, poor and the backward classes. He will damage the nation. Please vote for him."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X