వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మా స్వరాజ్‌‌కు మోడీ బర్త్‌డే గ్రీటింగ్స్.. విశిష్ట నాయకురాలు అంటూ ప్రశంసలు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఒక విశిష్ట నాయకురాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఒక గొప్ప నేతగా సుష్మ తనను తాను మలచుకున్నారంటూ ఆయన కొనియాడారు.

బుధవారం సుష్మాస్వరాజ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 'సుష్మా స్వరాజ్‌జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె ఒక విశిష్ట నాయకురాలిగా తనను తాను తీర్చుదిద్దుకున్నారు. విదేశాంగ మంత్రిగా భారత విదేశీ విధానానికి ఒక రూపం ఇవ్వడంలో ఆమె కీలక పాత్ర పోషించారు..' అని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

అంతేకాదు, 'చురుకుగా స్పందించే తత్వం, దయాగుణం సుష్మాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు దగ్గర చేసింది. ఆమె చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను..' అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనికి సుష్మాస్వరాజ్ కూడా వెంటనే ట్వీట్‌ రూపంలో స్పందించారు. తన పట్ల అవ్యాజమైన వాత్సలం చూపించిన ప్రధాని మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi on Wednesday wished External Affairs Minister (EAM) Sushma Swaraj on her birthday and called her an outstanding leader. “She has distinguished herself as an outstanding leader. As an EAM, she plays a vital role in shaping India’s foreign policy. Her proactive and compassionate nature has endeared her to Indians globally. I pray for her long life and good health,” the Prime Minister tweeted. Following Prime Minister’s wish Swaraj thanked him on Twitter. “Thank you Prime Minister narendramodi for your kind words,” she tweeted. Prime Minister Modi had earlier also lauded the minister for a change in the functioning of the Indian embassies across the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X