వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు చైనా అధ్యక్షుడి రాక.. మహాబలిపురంలో ప్రధాని మోడీతో భేటీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. మహాబలిపురం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వీరిద్దరు సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు. చైనా అధ్యక్షుడి రాక నేపథ్యంలో సమావేశం జరిగే ప్రాంతంతో పాటు పరిసరాలు కొత్త శోభ సంతరించుకున్నాయి.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటన ఖరారైంది. ఈ నెల 11, 12వ తేదీల్లో ఆయన ఇండియాకు రానున్నారు. తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన మహాబలిపురం సందర్శించనున్నారు. ఆ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనతో అక్కడే భేటీ కానున్నారు. ఇరు దేశాధినేతల సమావేశానికి మహాబలిపురం వేదిక కావడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

PM Modi, Xi Jinping Meet In Mahabalipuram For Informal Summit

కర్రలు లేచాయి.. తలలు పగిలాయి.. దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తంకర్రలు లేచాయి.. తలలు పగిలాయి.. దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తం

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడి రాక నేపథ్యంలో అక్కడి ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. ఇరువురి భేటీ కీలకంగా మారనుండటంతో ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. మహాబలిపురం పరిసర ప్రాంతాలు కొత్త హంగు సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక సమావేశాలు జరగనున్న ప్రాంగణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నారు.

కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ చారిత్రక వారసత్వ ప్రదేశాల్లో మహాబలిపురాన్ని యునెస్కో గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ ఇరువురి భేటీకి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో జిన్‌పింగ్‌ను భారత్ పర్యటనకు ఆహ్వానించారు మోడీ.

English summary
PM Modi and China President Xi Jinping meeting will be held at Tamilnadu Mahabalipuram for an informal summit in order to deepen bilateral cooperation. October 11, 12 dates fixed for that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X