వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, మల్లికార్జున్ ఖార్గే పేరు కూడా ఎత్తలేదు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా కర్ణాటకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గే సొంత నియోజక వర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయనను ఒక్క మాట కూడా విమర్శించకపోవడంతో బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పనుల గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం ముగించారు.

<strong>కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసమ్మతి సెగ, చేతులు ఎత్తేసిన మాజీ సీఎం: రంగంలోకి సీఎం కుమారస్వామి!</strong>కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసమ్మతి సెగ, చేతులు ఎత్తేసిన మాజీ సీఎం: రంగంలోకి సీఎం కుమారస్వామి!

షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ

షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ

లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గే ప్రాతినిధ్యం వహిస్తున్న గుల్బర్గ
(కలబురిగి) నియోజక వర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభా సమావేశం నిర్వహించారు. మల్లికార్జన్ ఖార్గే మీద ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుడి విమర్శలు చేస్తారని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ షాక్ ఇచ్చారు.

తండ్రి, కుమారుడు

తండ్రి, కుమారుడు

కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్ ఖార్గే, ఆయన కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే మీద ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పిస్తారని, అది పార్టీకి మేలు చేసే అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు భావించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మల్లికార్జున్ ఖార్గే, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖార్గే పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడంతో బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

టార్గెట్ సీఎం కుమారస్వామి

టార్గెట్ సీఎం కుమారస్వామి

ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సమవేశంలో మాట్లాడిన సమయంలో స్థానిక ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కువ విమర్శలు చెయ్యలేదు. అయితే ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక్క రిమోట్ కంట్రోల్ సీఎం అంటూ విమర్శలు చేశారు. మహాఘటక్ బంధన్ గురించి మోడీ ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీ తూతూ మంత్రం ప్రసంగంతో బీజేపీ నాయకులు నిరాశకు గురైనారు.

దళిత నాయకుడు

దళిత నాయకుడు

మల్లికార్జున్ ఖార్గేని విమర్శిస్తే దళితులను విమర్శించినట్లు అవుతోందని ప్రధాని మోడీ జాగ్రత్త పడ్డారని సమాచారం. ఇప్పటికే దళితులు బీజేపీకి అంటిముట్టనట్లు ఉన్నారు. దళితులను దూరం చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ మల్లికార్జున్ ఖార్గే, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖార్గేన విమర్శంచలేదని బీజేపీ సీనియర్ నాయకులు పైకి అంటున్నారు.

గతంలో విమర్శలు

గతంలో విమర్శలు

2018 శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా కలబురిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మల్లికార్జున్ ఖార్గే మీద విమర్శలు గుప్పించారు. అయితే బుధవారం జరిగిన బహిరంగ సమావేశంలో కేవలం మల్లికార్జున్ ఖార్గే పేరుకూడా ప్రస్తావించలేదు. ప్రతిపక్షాలను ఎక్కువ విమర్శించకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ ప్రధాన్యత ఇచ్చారు.

11సార్లు కింగ్

11సార్లు కింగ్

మల్లికార్జన్ ఖార్గే ఎన్నికల బరిలో నిలిచిన ప్రతిసారి విజయం సాధించారు. ఓటమి అనే పదం ఆయన రాజకీయ జీవితంలో లేదు. 9 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా విజయం సాధించిన మల్లికార్జున్ ఖార్గే తన రాజకీయ జీవితంలో ఓటమి అనే పదానికి దూరంగా ఉంటున్నారు. 2019 లోక్ సభ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అంటూ మల్లికార్జున్ ఖార్గే ఇప్పటికే ప్రకటించారు.

English summary
PM Narendra Modi addressed rally in Congress tall leader Mallikarjun Kharge's constituency Kalburagi but he did not mention him in his entire speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X