వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AatmanirbharBharat: ఇదే మంత్రం..రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం అని పేర్కొన్నారు. ప్యాకేజీ వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేస్తారని తెలిపారు. స్వయం సమృద్ది, ఆర్థిక నిర్మాణం కోసమే ప్యాకేజీ ప్రకటిస్తున్నామని.. తెలిపారు. సూక్ష్మ, మధ్యతరగతి వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ల్యాండ్, లేబర్, లా, లిక్విడిటీకి బలం చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం జాతినుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు.

Recommended Video

20 Lakh Crore COVID relief package, Special Economic Package Equals 10% of India's GDP
లోకల్ మార్కెట్

లోకల్ మార్కెట్

ఇక నుంచి స్థానిక వస్తువులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఉత్పత్తి, సప్లైకి ప్రయారిటీ ఇస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఖాదీ, హ్యాండ్లూమ్‌కు డిమాండ్ లేదని.. వాటికి మంచి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూనే ముందుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆత్మస్థైర్యం కలిగిన భారత్ ఆ విధంగా ముందుకెళుతుందని చెప్పారు. భారత్‌కు ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, వ్యవస్థ, డెమోగ్రపీ అనే నాలుగు పిల్లర్లు, ఐదో పిల్లర్ డిమాండ్ అని మోడీ పేర్కొన్నారు. దేశంలో డిమాండ్, సప్లై ఉంటుందని తెలిపారు.

42 లక్షల మందికి వైరస్

42 లక్షల మందికి వైరస్


కరోనా మహమ్మరితో ప్రపంచ యుద్దం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మందికి వైరస్ సోకిందని.. 2 లక్షల 88 వేల మంది చనిపోయారని చెప్పారు. ఇలాంటి విపత్తు ఇదివరకు ఎన్నడూ ఎరగలేమని, కానీ వైరస్‌పై పోరాడేందుకు మనం సిద్దంగా లేమని చెప్పారు. గత 4 నెలల నుంచి కరోనా వైరస్‌తో ఆలుపెరగకుండా పోరాడుతున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత వేలాది మాస్క్‌లు రూపొందించుకున్నామని మోడీ పేర్కొన్నారు. తొలినాళ్లలో ఎన్ 95 మాస్క్, పీపీఈ కిట్లు అందుబాటులో లేవని... కానీ ఇప్పుడు రోజుకు 2 లక్షల ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.

18వ తేదీన నిబంధనలు

18వ తేదీన నిబంధనలు

4.0 లాక్ డౌన్ నిబంధనలను ఈ నెల 18వ తేదీన తెలియజేస్తామని మోడీ పేర్కొన్నారు. ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన మోడీ.. స్థానిక మార్కెట్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బూస్ట్ ఇస్తుందని అంచనా వేశారు. సనాతన హిందు సంప్రదాయం, ధర్మంతో వైరస్‌ నిర్మూలన కోసం పాటుపడుతున్నామని చెప్పారు.

English summary
world fight with coronavirus..india at critical juncture in virus prime minister narendra modi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X