వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ సంచలన నిర్ణయం: ఒలింపిక్స్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రీడల్లో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఒలింపిక్స్‌ కోసం ప్రణాళిక సిద్ధం చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

రియో ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై విమర్శల నేపథ్యంలో క్రీడలను ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. 2020, 2024, 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని క్రీడాకారులను సన్నద్ధం చేసేందుకు ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

PM Narendra Modi

క్రీడాకారులకు కావాల్సిన క్రీడా సదుపాయాలు, శిక్షణ, ఎంపిక విధానం తదితర అన్ని విషయాలపై వీరు ఎప్పటికప్పుడు టాస్క్‌ఫోర్స్‌ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించనుంది. ఈ యాక్షన్ ప్లాన్‌తో ఒలింపిక్స్‌లో భారత్ మెరవనుంది. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

వంద మందికి పైగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల్లో ఇద్దరు మాత్రమే పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పీవీ సింధు రజతం సాధించగా, రెజ్లింగ్‌లో హర్యానాకు చెందిన సాక్షి మ‌ాలిక్‌ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.

రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పూర్తిగా నిరాశపరిచారు. దీంతో మేలుకున్న కేంద్ర ప్రభుత్వం రాబోయే ఒలింపిక్స్‌ క్రీడలకు ఇప్పటినుంచే క్రీడాకారులను సన్నద్ధం చేసేందుకు సమాయత్తం అవుతోంది. అటు చైనా వంటి దేశాలు కూడా క్రీడల్లో భారత ప్రదర్శనపై తక్కువ చేసి మాట్లాడటంతో తాజాగా మోడీ నిర్ణయం సంచలనంగా మారింది.

English summary
Prime Minister Narendra Modi has announced that his government would set up a task force to create a strategy to help sportspersons prepare for the next three Olympics. The task force would cover infrastructure, training and selection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X