వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డ్: నేపాల్‌కు మోడీ వరాలు, పురాతనమని(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ఖట్మాండు: నేపాల్‌ దేశంలో ఆదివారం పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశంపై వరాల జల్లు కురిపించారు. పది వేల కోట్ల నేపాలీ రూపాయలను (సుమారు రూ.6000 కోట్లు) రుణంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. సరిహద్దులు రెండు దేశాల మధ్య సంబంధాలు కలిపే వంతెనలు కావాలి కానీ.. విడదీసే అడ్డుగోడలు కారాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నేపాల్‌తో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. నేపాల్‌ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు నెలకొల్పారు.

నేపాల్‌ అభివృద్ధికి ‘హిట్‌' ఫార్ములాను కూడా ఆయన ప్రతిపాదించారు. రెండు రోజుల నేపాల్‌ పర్యటనలో భాగంగా మోడీ ఆదివారం ఖట్మాండులో అడుగుపెట్టారు. 17 ఏళ్ల తర్వాత నేపాల్‌ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధాని ఆయనే. దీంతో, ప్రోటోకాల్‌ను కూడా పక్కనపెట్టి నేపాల్‌ ప్రధాన మంత్రి సుశీల్‌ కొయిరాలా, ఉప ప్రధానులు, విదేశాంగ మంత్రి తదితరులు త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలి వచ్చి మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఐదు నక్షత్రాల హోటల్లో బస చేసిన మోడీని నేపాల్‌ విదేశాంగ మంత్రి మహేంద్ర పాండే మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గంటపాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

ఆ తర్వాత మోడీ నేపాల్‌ సచివాలయానికి వెళ్లి ప్రధాని కొయిరాలాతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాలూ మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అయోడిన్‌ లోపం కారణంగా వచ్చే గాయిటర్‌ వంటి వ్యాధుల నిరోధానికి అయోడిన్‌ ఉప్పును సరఫరా చేయడానికి వీలుగా 6.9 కోట్ల నేపాలీ రూపాయలను గ్రాంటుగా ఇచ్చేందుకు మొదటి ఒప్పందం కుదుర్చుకున్నారు. పంచేశ్వర్‌ మల్టిపుల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్టికల్‌ 17, 18ల్లో సవరణలకు సంబంధించి రెండో ఒప్పందం కుదుర్చుకున్నారు.

నేపాల్‌ ప్రభుత్వ టెలివిజన్‌, దూరదర్శన్‌ మధ్య సహకారానికి సంబంధించి మూడో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, నేపాల్‌ పర్యటనలో ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. నేపాల్‌ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయుడిగా మోడీ రికార్డు సృష్టించారు. అంతేగాక రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన రెండో విదేశీయుడు కూడా ఆయనే. గతంలో 1990లో హెల్మెట్‌ కోల్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆ తర్వాత, నేపాల్‌ రాజ్యాంగ సభలో ముఖ్య అతిథిగా మోడీ 45 నిమిషాలపాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేపాల్‌కు తక్కువ వడ్డీతో పది వేల కోట్ల రూపాయల నేపాలీ రూపాయల రుణం ఇవ్వనున్నట్లు మోడీ ప్రకటించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

నేపాల్‌ దేశంలో ఆదివారం పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశంపై వరాల జల్లు కురిపించారు. పది వేల కోట్ల నేపాలీ రూపాయలను (సుమారు రూ.6000 కోట్లు) రుణంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

సరిహద్దులు రెండు దేశాల మధ్య సంబంధాలు కలిపే వంతెనలు కావాలి కానీ.. విడదీసే అడ్డుగోడలు కారాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నేపాల్‌తో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

నేపాల్‌ అభివృద్ధికి ‘హిట్‌' ఫార్ములాను కూడా ఆయన ప్రతిపాదించారు. రెండు రోజుల నేపాల్‌ పర్యటనలో భాగంగా మోడీ ఆదివారం ఖట్మాండులో అడుగుపెట్టారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

నేపాల్‌లోని పశుపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడికి చేరుకున్న నేపాలీ ప్రజలకు అభివాదం తెలుపుతున్న నరేంద్ర మోడీ.

మోడీతో చేతులు కలుపుతూ..

మోడీతో చేతులు కలుపుతూ..

ప్రోటోకాల్‌ను కూడా పక్కనపెట్టి నేపాల్‌ ప్రధాన మంత్రి సుశీల్‌ కొయిరాలా, ఉప ప్రధానులు, విదేశాంగ మంత్రి తదితరులు త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలి వచ్చి మోడీకి ఘనంగా స్వాగతం పలికారు.

‘నేపాల్‌ కోసం నా దగ్గర ఓ హిట్‌ ఫార్ములా ఉంది. ఇక్కడ హిట్‌ అంటే.. హైవేలు.. ఐవేలు.. ట్రాన్స్‌వేలు! ఈ మూడింటినీ సమ్మిళితం చేస్తే నేపాల్‌లో అభివృద్ధి పరుగులు పెడుతుంది. అతి త్వరలోనే నేపాల్‌కు ఈ బహుమతి ఇవ్వాలని భారత్‌ భావిస్తోంది. దీనర్థం ఏమిటంటే.. మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు హైవేల నిర్మాణానికి సహకరిస్తాం. ఇన్ఫర్మేషన్‌ హైవేలను అభివృద్ధి చేసుకోవడానికి చేయూతనిస్తాం. దాంతో నేపాల్‌ కూడా డిజిటల్‌ నేపాల్‌ అవుతుంది. ఇక, జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి నేపాల్‌లో అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఎగుమతి, దిగుమతులకు వీలుగా ట్రాన్స్‌మిషన్‌ లైన్లను వేస్తాం' అని ప్రజా ప్రతినిధుల కరతాళ ధ్వనుల మధ్య మోడీ ప్రకటించారు.

‘తన విద్యుత్తుతో భారత్‌లోని చీకట్లను నేపాల్‌ తొలగించగలదు. మీ విద్యుత్తు మాకేమీ ఉచితంగా వద్దు. దానిని మేం కొనుగోలు చేస్తాం. భారత్‌కు విద్యుత్తును విక్రయించడం ద్వారా నేపాల్‌ కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవవచ్చు'' అని మోడీ వ్యాఖ్యానించారు. భారత్‌, నేపాల్‌ సంబంధాలు హిమాలయాలు, గంగా నది అంత పురాతనమైనవని, రెండింటి మధ్య సన్నిహిత బంధం ఉందని చెప్పారు. ‘‘మీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మా అభిమతం కాదు. కానీ, మీరు యుద్ధ మార్గం వదిలి బుద్ధ మార్గం ఎంచుకున్నారు. ఆయుధాలు వదిలి ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మీరు ఎంచుకున్న మార్గంలో మీకు సహకరిస్తాం'' అని మోడీ చెప్పారు

నేపాలీలో మాట్లాడి ఆకట్టుకున్న మోడీ

నేపాల్‌ రాజ్యాంగ సభలో నేపాలీ భాషలో మాట్లాడి ఆ దేశ ప్రజలు, ప్రజా ప్రతినిధుల హృదయాలను గెలుచుకున్నారు ప్రధాని మోడీ. రాజ్యాంగ సభలో ప్రసంగాన్ని ఆయన నేపాలీలోనే ప్రారంభించారు. చాలా కాలం కిందట తాను యాత్రికుడిగా నేపాల్‌ వచ్చానని గుర్తు చేశారు. మోడీ ప్రసంగాన్ని మావోయిస్టు నేత ప్రచండ సహా నేపాల్‌లోని రాజకీయ నాయకులంతా ముక్తకంఠంతో కొనియాడారు. ఆయన ప్రసంగం మనసులకు హత్తుకునేలా ఉందని, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు.

English summary
Prime Minister Narendra Modi on Sunday announced NRs 10,000 crore as concessional line of credit to Nepal and proposed a HIT formula for the development of the land-locked country endowed with rich hydropower potential.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X