వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఫెల్ వివాదంలో మోడీకి ఊరట.. సుప్రీంకోర్టు ఏమందో తెలుసా?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద ఊరట లభించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు చేయాలని వేసిన పిటిషన్లను కొట్టిపారేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఆ వివాదంలో ఎలాంటి విచారణ అవసరం లేదని తేల్చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అనుమానాలు అవసరం లేదని, వాటి ఖరీదెంత తదితర విషయాలు పరిశీలించాల్సిన అవసరం లేదని తెలిపింది. రక్షణశాఖ కొనుగోళ్లు సున్నితమైన అంశమని.. లోతుగా విచారణ చేయాల్సిన అవసరమేదీ లేదని స్పష్టం చేసింది.

Recommended Video

Rafale Verdict: #SCNailsRaGaLies : Amit Shah Targets Rahul Gandhi | Oneindia Telugu
pm Narendra Modi got a great relief from rafale scam.

36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. వాటి నిర్మాణం, మెయింటెనెన్స్ తదితర అంశాలకు సంబంధించి రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు పనులు అప్పగించింది. అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ ఉండగా రిలయన్స్ సంస్థకు ఎలా ఇస్తారని విపక్షాలు మండిపడ్డాయి. పెద్దఎత్తున రాద్ధాంతం చేశాయి. 58 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. రాఫెల్ యుద్ధ విమానాల నాణ్యతలో, కొనుగోళ్లలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లన్నీ కొట్టిపారేసింది.

English summary
Prime Minister Narendra Modi got a great relief. The Supreme Court dismissed petitions to investigate the purchase of Rafael fighter planes. There is no need for any inquiry into the dispute. The Supreme Court does not have to intervene.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X