వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ ముందు రాహుల్ దిగదుడుపే.. కేరళ ప్రజలు తప్పు చేశారు.. వైరల్‌గా గుహ కామెంట్లు

|
Google Oneindia TeluguNews

కష్టపడి పనిచేస్తూ, సొంత విధానాలతో మందుకెళ్తోన్న ప్రధాని నరేంద్ర మోడీ ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలువలేకపోతున్నారని చరిత్రకారుడు రామచంద్ర గుహ అభిప్రాయపడ్డారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, కానీ తర్వాత ఆ పార్టీలో రాచరికం ఏలడంతో కిందకి పడిపోయిందన్నారు. అందుకు ప్రధాని నరేంద్ర మోడీకి గొప్ప ప్రయోజనం ఏంటి అంటే ఆయన రాహుల్ గాంధీ కారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ సాహిత్య ఉత్సవానికి (కేఎల్ఎఫ్) హాజరై రామచంద్ర గుహా మాట్లాడారు.

తప్పుచేశారు..

తప్పుచేశారు..


కేఎల్ఎఫ్ నాలుగురోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తోంది. రెండోరోజు హాజరైన రామచంద్ర గుహ ‘దేశభక్తి వర్సెస్ యుద్దోన్మాదం' అంశంపై ప్రసంగించారు. 2020లో కేఎల్ఎఫ్ పర్యావరణం, వాతావరణ మార్పు కలిగించేందుకు అవాగాహన కల్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి చరిత్రకారుడు రామచంద్రగుహ హాజరై ప్రసంగించారు. కానీ రాహుల్ గాంధీని కేరళ ప్రజలు ఎన్నుకొని తప్పు చేశారని పేర్కొన్నారు. తాను ఇలా అనడంతో రాహుల్‌గాంధీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. ఆయన మంచి వ్యక్తి అని, అందరితో హుందాగా ఉంటారని.. కానీ యంగ్ ఇండియా మాత్రం గాంధీ-నెహ్రూ ఐదో తరం నేతను అంగీకరించబోదని చెప్పారు.

2024లో గెలిపించండి.. కానీ

2024లో గెలిపించండి.. కానీ

ఇప్పుడే కాదు 2024లో కూడా మీరు కేరళ నుంచి రాహుల్ గాంధీని ఎన్నుకుంటే అదీ ఆయనకు మంచి కాదు అని.. ప్రధాని మోడీకి ప్రయోజనం అని ఉద్ఘాటించారు. ‘దేశం కోసం మీరు చాలా మంచి పనులు చేశారు, కానీ రాహుల్ గాంధీని పార్లమెంట్‌కు పంపించి మాత్రం తప్పు చేశారని వాయనాడు ప్రజలను ఉద్దేశించి రామచంద్ర గుహ అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పాలనా అనుభవం ఉంది. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రం, దేశం కోసం కష్టపడి పనిచేశారు. ఆయన యూరప్ పర్యటించిన సమయంలో కూడా హాలీడే తీసుకోలేదు అని' రామచంద్ర గుహ అన్నారు. తాను చెప్పేది నిజమని, విశ్వసించాలని కోరారు.

రాహుల్ మేధావి కానీ..

రాహుల్ మేధావి కానీ..


నరేంద్ర మోడీ కన్నా రాహుల్ గాంధీ మేధావి అని, ఎక్కువ కష్టపడి పనిచేస్తారని రామచంద్ర గుహ చెప్పారు. అతను కూడా ఐరోపా పర్యటనలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు అని పేర్కొన్నారు. కానీ రాజవంశంలో జన్మించడం వల్ల, రాహుల్ గాంధీ స్వయం ప్రకాశిత వ్యక్తి కాలేకపోతున్నారని చెప్పారు. ఇది అతనికి ప్రతికూలతగా మారిందని ఉదహరించారు. రాహుల్ గాంధీయే కాదు సోనియా గాంధీ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది అని చెప్పారు. మొఘల్ వంశస్తుల మాదిరిగా రాజ్యం అంతకంతకు అంతరించిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు.

ఇదీ విషయం

ఇదీ విషయం

భారతదేశం ఎక్కువ ప్రజాస్వామ్యం, తక్కువగా భూస్వామ్యం కలిగి ఉన్న కంట్రీ అని రామచంద్ర గుహ పేర్కొన్నారు. కానీ ఆ విషయం గాంధీ కుటుంబీకులు గ్రహించలేకపోతున్నారని చెప్పారు. ఢిల్లీలో ఉండే సోనియా.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంతో తెలుసుకోలేకపోతున్నారు. ఆమె చెంచాలు ఏం చెబితే అదే నిజమని నమ్మి.. తన పార్టీ పరిస్థితి మరింత దిగజారేందుకు కారణమయ్యారని పేర్కొన్నారు.

English summary
PM Narendra Modi great advantage is he is not Rahul Gandhi historian Ramchandra Guha said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X