వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీతో ఎల్ కే అద్వానికి మానసిక హింస: గతం గుర్తు లేదా ? ఫ్యామిలీ, మాజీ ప్రధాని ఫైర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దశాభ్దాల కాలంగా తాను రాజీయం పోరాటం చేస్తూ వస్తున్నానని, వయసు మీద పడినా ఇంకా పోరాటం చెయ్యాలని ఉందని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ. దేవేగౌడ అన్నారు. అయితే మీరు (కన్నడ మీడియా) సహకరిస్తున్న తీరు భాదకరంగా ఉందని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మండిపడ్డారు. మాజీ ఉప ప్రధాని ఎల్ కే. అద్వానిని ప్రధాని నరేంద్ర మోడీ మానసికంగా హింసించారని దేవేగౌడ ఆరోపించారు.

మోడీతో కష్టం

మోడీతో కష్టం

ప్రస్తుత రాజకీయాలు గమనిస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీతో పోరాటం చెయ్యడం అంత సులభం కాదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడం ప్రజలకు మాత్రమే సాధ్యం అవుతుందని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. మనమందరం కలిసి ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కొవాలని, ఇది మనకు అగ్నిపరీక్ష అని దేవేగౌడ కార్యకర్తలకు సూచించారు.

అద్వానికి మానసిక హింస

అద్వానికి మానసిక హింస

బీజేపీని ఈ స్థాయికి తీసుకువచ్చిన మాజీ ఉప ప్రధాని ఎల్ కే. అద్వానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన సన్నిహితులు మానసికంగా హింసించారని హెచ్.డి. దేవేగౌడ ఆరోపించారు. ఎల్ కే. అద్వానిని రాష్ట్రపతిని ఎందుకు చెయ్యలేదు అని ప్రధాని నరేంద్ర మోడీని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఎల్ కే. అద్వాని ఎంతో శ్రమించారని, అలాంటి రాజకీయ నాయకులు దేశానికి అవసరం అని హెచ్.డి. దేవేగౌడ అన్నారు.

ఫ్యామిలీ పాలిటిక్స్

ఫ్యామిలీ పాలిటిక్స్

జేడీఎస్ ది కుటుంబ రాజకీయాలు అంటూ బీజేపీ విమర్శలు చేస్తున్నదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. దేశంలో ఎక్కడా లేని కుటుంబ రాజకీయాలు ఒక్క దేవేగౌడ కుటుంబంలోనే జరుగుతున్నాయా ? అని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. మొదట మమ్మల్ని విమర్శించే ముందు బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ సలహా ఇచ్చారు. జేడీఎస్ కార్యకర్తల మనవి మేరకే తమ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మాజీ ప్రధాని దేవేగౌడ సమర్థించుకున్నారు.

దేశ ప్రధానిగా ఎంతో చేశా

దేశ ప్రధానిగా ఎంతో చేశా

2019 లోక్ సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు తాను ఏమీ మాట్లాడనని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని అన్నారు. ప్రధాన మంత్రిగా తానే చేసిన అభివృద్ది పనులు మీకు (కన్నడ మీడియాకు )కనపడటం లేదని, చిన్న డిబెట్ తో వాటిని తెరమరుగు చేస్తున్నారని మాజీ ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు.

అద్వాని శ్రమ

అద్వాని శ్రమ

నేడు బీజేపీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎల్ కే అద్వాని శ్రమ ఎంతో ఉందని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. అయితే గతం మరిచిపోయిన ప్రధాని నరేంద్ర మోడీ ఎల్ కే. అద్వానికి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం లేకుండా చేసి ఆయనను మానసికంగా హింసించారని మాజీ ప్రదాని హెచ్.డి. దేవేగౌడ ఆరోపించారు. ఎల్ కే. అద్వానితో పాటు బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషికి సైతం ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వలేదని, బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

English summary
Prime MInsiter Narendra Modi has given mental torture to senior BJP leader LK Advani, JDS supremo Deve Gowda statement in Tumakuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X