వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘హవాలబాజ్’: సోనియాకు కౌంటర్ ఇచ్చిన మోడీ

|
Google Oneindia TeluguNews

భోపాల్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని గాలి మాటలు(హవాబాజ్) చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

సోనియా విమర్శలకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కౌంటర్ ఇచ్చారు. నల్లధనాన్ని వెనక్కు రప్పించేందుకు తాము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే 'హవాలాబాజ్'(అవినీతిపరులు) అడ్డుకుంటోందని కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

భోపాల్‌లో 10వ ప్రపంచ హిందీ మహాసభలు ప్రారంభించేందుకు వచ్చిన మోడీ గురువారం బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇతరులను విమర్శించాల్సిన అవసరం తమకు లేదని, తమ లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు.

PM Narendra Modi hits out at Congress, terms it 'hawalabaaz'

దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా పాటు పడుతున్నామని ప్రధాని అన్నారు. ప్రజలు తమకు పూర్తి మెజారిటీ ఇచ్చారని, వారి తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమతో కలిసి పనిచేయాలని ప్రతిపక్ష పార్టీలను కోరామని తెలిపారు. ఆ పార్టీలు తమ అభ్యర్థనకు స్పందించలేదని అన్నారు.

నల్లధనాన్ని వెనక్కు రప్పించేందుకు చట్టం చేశామని, దీంతో 'హవాలాబాజ్' ఇబ్బందుల్లో పడ్డారని విమర్శించారు. అవినీతికి పాల్పడిన వారే సమాధానం చెప్పాలని మమల్ని అడుగుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు పెద్ద ఎత్తున స్వచ్ఛ కార్యక్రమం చేపట్టబోతున్నామని వివరించారు.

అంతకుముందు హిందీ మహాసభలో మాట్లాడుతూ.. హిందీని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. హిందీ భాష వికాసానికి కృషి చేయాలన్నారు. జాతీయ నేతలందరూ హిందీ నేర్చుకుని భాషాభివృద్ధికి కృషి చేశారని చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday hit out at the Congress for not allowing parliament to function during the monsoon session, terming it 'hawalabaaz' (corrupt) and accusing it of creating roadblocks for the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X