వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్యలేవి: ముంబై పేలుళ్లపై నవాజ్ షరీఫ్‌కు మోడీ ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మంగళవారం భేటీ అయి ముంబై పేలుళ్ల కేసు విచారణ పైన తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మోడీ, షరీఫ్‌లు న్యూఢిల్లీలోని హైదరాబాదు హౌస్‌లో దాదాపు యాభై నిమిషాల పాటు భేటీ అయ్యారు.

వీరి భేటీలో ఉగ్రవాదం పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం మేరకు... ముంబై పేలుళ్లపై పాక్ విచారణ మందకోడిగా సాగుతోందని మోడీ పాక్ ప్రధానితో అన్నారని సమాచారం. ఉగ్రవాదుల దాడి ఆపాలని కోరారు. ముంబై పేలుళ్లపై పాకిస్తాన్ విచారణ పట్ల మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

 PM Narendra Modi holds talks with Nawaz Sharif

కుట్రదారుల పైన చర్యలు ఏవని ప్రశ్నించారు. ఉపఖండంలో ఉగ్రవాదం అంతానికి సహకరించుకుందామని సూచించారు. ముంబై పేలుళ్ల కేసు నిందితుల వాయిస్ శాంపిల్ కావాలని అడిగారు. ముంబై పేలుళ్ల నిందుతుల పైన చర్య తీసుకోవాలన్నారు.

నవాజ్ షరీఫ్‌తో భేటీలో మోడీ ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. తీవ్రవాద దాడులు ఆపేయాలని, 26/11 కేసు అసంతృప్తికరంగా ఉందని, 26/11 నిందితులపై చర్యలు తీసుకోలేదని, ఇరు దేశాలు ఉగ్రవాదం అంతంపై సహకరించుకోవాలని మోడీ సూచించినట్లుగా తెలుస్తోంది.

కాగా, మోడీతో భేటీ అనంతరం నవాజ్ షరీఫ్ భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజపేయిని కలిశారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మోడీతో భేటీ అనంతరం నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ... మోడీతో భేటీ ఎక్సలెంట్ అన్నారు. మోడీతో సమావేశం సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi on Tuesday held talks with his Pakistani counterpart Nawaz Sharif. Modi was accompanied by External Affairs Minister Sushma Swaraj, Foreign Secretary Sujatha Singh among others during the talks with Sharif, who arrived here to attend Modi's swearing-in yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X