వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంకితభావంతో పనిచేయండి: టీ పార్టీలో మోడీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం చేపట్టిన పేదల అనుకూల పథకాల అమలుకు అంకిత భావంతో పనిచేయాలని శివసేన సహా ఎన్డీయే ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఉన్నతంగా, ఉదాత్తంగా, రాజకీయాలతో ప్రమేయం లేకుండా పేదల బాగు కోసం పనిచేయాలని ఎంపీలకు ఆదివారం ఇచ్చిన తేనేటి విందు సందర్భంగా మోడీ కోరారు. దాదాపు 400మంది ఎంపీలను ఉద్దేశించి మోడీ మాట్లాడారు.

‘గుణాత్మక, నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా పని చేయాలి. సానుకూల బలంతో అద్వితీయ శక్తిగా ఉన్న ఎన్డీయే కూటమి దేశాన్ని సరికొత్త బాటలో నడిపించేందుకు నడుంబిగించాలి' అని కోరారు. భావ సారూప్యత కలిగిన రాజకీయ శక్తిగా ఏర్పడిన ఎన్డీయే కూటమి దేశాన్ని ఖచ్చితంగా సరికొత్త బాటలో నడిపించగలుగుతుందని ఉద్ఘాటించారు. ‘విశాలంగా ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగా పని చేయాలి' అని ఉద్బోధించారు.

మోడీ టీ పార్టీ

మోడీ టీ పార్టీ

రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం చేపట్టిన పేదల అనుకూల పథకాల అమలుకు అంకిత భావంతో పనిచేయాలని శివసేన సహా ఎన్డీయే ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

మోడీ టీ పార్టీ

మోడీ టీ పార్టీ

ఉన్నతంగా, ఉదాత్తంగా, రాజకీయాలతో ప్రమేయం లేకుండా పేదల బాగు కోసం పనిచేయాలని ఎంపీలకు ఆదివారం ఇచ్చిన తేనేటి విందు సందర్భంగా మోడీ కోరారు. దాదాపు 400మంది ఎంపీలను ఉద్దేశించి మోడీ మాట్లాడారు.

మోడీ టీ పార్టీ

మోడీ టీ పార్టీ

‘గుణాత్మక, నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా పని చేయాలి. సానుకూల బలంతో అద్వితీయ శక్తిగా ఉన్న ఎన్డీయే కూటమి దేశాన్ని సరికొత్త బాటలో నడిపించేందుకు నడుంబిగించాలి' అని కోరారు.

మోడీ టీ పార్టీ

మోడీ టీ పార్టీ

భావ సారూప్యత కలిగిన రాజకీయ శక్తిగా ఏర్పడిన ఎన్డీయే కూటమి దేశాన్ని ఖచ్చితంగా సరికొత్త బాటలో నడిపించగలుగుతుందని ఉద్ఘాటించారు. ‘విశాలంగా ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగా పని చేయాలి' అని ఉద్బోధించారు.

మోడీ టీ పార్టీ

మోడీ టీ పార్టీ

ప్రధాని అధికార నివాసంలో దాదాపు రెండు గంటలుపైగా జరిగిన సమావేశంలో ఎలాంటి రాజకీయ అంశాలూ ప్రస్తావనకు రాలేదు. స్వచ్ఛ భారత్, జనధన్, ఎంపీల ఆదర్శ గ్రామం వంటి తన ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలుకు ఎంపీలందరూ అంకితభావంతో పని చేయాలని మోడీ కోరారు.

ప్రధాని అధికార నివాసంలో దాదాపు రెండు గంటలుపైగా జరిగిన సమావేశంలో ఎలాంటి రాజకీయ అంశాలూ ప్రస్తావనకు రాలేదు. స్వచ్ఛ భారత్, జనధన్, ఎంపీల ఆదర్శ గ్రామం వంటి తన ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలుకు ఎంపీలందరూ అంకితభావంతో పని చేయాలని మోడీ కోరారు. పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలనూ ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఇటీవల ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి విస్తృత ప్రతిస్పందన లభించిందన్నారు.

తమతమ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని అమలు చేసేటప్పుడు ప్రజలతో మమేకం కావాలని ఎంపీలను కోరారు. నవంబర్ 14 నుంచి 5 రోజులపాటు తమతమ పరిధిలోని స్కూళ్లలో పర్యటించి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల సమాజంలోకి మరింత గుణాత్మక సందేశాన్ని బలంగాపంపే అవకాశం ఉంటుందన్నారు. స్వచ్ఛ భారత్‌ను సాధించడం సంక్లిష్ట లక్ష్యమే అయినప్పటికీ పోలియోను తరిమి కొట్టేందుకు ఎలాంటి స్ఫూర్తితో ప్రజలు పనిచేశారో అలాంటి అంకిత భావాన్ని ప్రదర్శిస్తే అసాధ్యమేమీ కాదన్నారు.

బిజెపి ఎంపీలతోపాటు శిరోమణి అకాలీదళ్, తెలుగుదేశం, ఎల్‌జెపి, అప్నా దళ్, ఇతర లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా విందుకు హాజరయ్యారు. కాగా, మహారాష్టల్రో బిజెపి సారథ్యంలో ఏర్పడే ప్రభుత్వంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన చేరుతుందా? లేదా? అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే సహా శివసేనకు చెందిన ఎంపీలందరూ ప్రధాని విందుకు హాజరయ్యారు. ఎన్డీయే ఎంపీలతో ప్రధాని భేటీ అధికారిక కార్యక్రమంగానే జరిగిందని రాజకీయాలకు సంబంధించిన అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని అనంతరం అనంత్ గీతే తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi's ambitious projects such as the Clean India campaign and the MP Model Village scheme will be taken up during the high tea for NDA MPs this evening with a view to seek their support and participation for its success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X