బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోడీ, కర్ణాటక సీఎం కుమారస్వామి భేటీ వాయిదా, ఇప్పుడు కాదు, గోవా బీజేపీ, కావేరి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి భేటీ వాయిదా పడింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యకలాపాల కారణంగా కొన్ని గంటల పాటు కుమారస్వామితో భేటీ వాయిదా పడిందని ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చింది. ప్రధాని మోడీ, కుమారస్వామిల మద్య గోవా మహాదాయి నీరు, కావేరి నీటి విషయం, రైతుల రుణమాఫీలు తదితర సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం

ఉదయం వాయిదా

ఉదయం వాయిదా

ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మే 28వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు భేటీ అయ్యేందుకు మొదట సమయం నిర్ణయించారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆదివారం రాత్రి 9 గంటలకు ఢిల్లీ వెళ్లడానికి సిద్దం అయ్యారు.

సాయంత్రం రండి

సాయంత్రం రండి

ప్రధాని నరేంద్ర మోడీని కలవబడానికి సోమవారం ఉదయం 11 గంటలకు కాదని, సాయంత్రం 5.30 గంటలకు రావాలని ప్రధాని కార్యాలయం అధికారులు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి సమాచారం ఇచ్చారు. సోమవారం మద్యాహ్నం 3.30 గంటలకు హెచ్.డి. కుమారస్వామి ఢిల్లీలోని రాజ్ ఘాట్ సందర్శించనున్నారు.

కర్ణాటక సమస్యలు

కర్ణాటక సమస్యలు

కర్ణాటకలోని పలు సమస్యలు, రైతుల రుణమాఫీపై కేంద్ర ప్రభుత్వం అందిచే సహాయం, గోవాతో ఉన్న మహాదాయి నీటి పంపిణి సమస్య, కావేరీ నీటి పంపిణి కోసం ఏర్పాటు చేసే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు తదితర సమస్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

మొదటి సారి ఢిల్లీ

మొదటి సారి ఢిల్లీ

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హెచ్.డి. కుమారస్వామి మొదటిసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోమవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి బెంగళూరు రానున్నారు.

English summary
Delhi visit of chief minister HD Kumaraswamy was postponed to Monday evening. Earlier he was planning to leave for delhi at 9 PM on Sunday to meet Narendra Modi on Monday morning at 11 AM. But Prime Minister's office has changed the meeting time to Monday evening at 5.30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X