వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ఎన్నికలు, నరేంద్ర మోడీ ప్రచారం, డేట్ ఫిక్స్, ప్రధానికి పోటీగా రాహుల్ గాంధీ ర్యాలీలు!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికలు 2017 ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తులు పూర్తి చేశారు. నవంబర్ 27, 29వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటించనున్నారు. ప్రధానికి పోటీగా రాహుల్ గాంధీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం డేట్ లు ఫిక్స్ చేశారు.

హార్దిక్ పటేల్ ఒక ఫూల్: మూర్ఖులు మరి కొందరు మూర్ఖులకు హామీ ఇచ్చారు: డీసీఎం ఫైర్!హార్దిక్ పటేల్ ఒక ఫూల్: మూర్ఖులు మరి కొందరు మూర్ఖులకు హామీ ఇచ్చారు: డీసీఎం ఫైర్!

గుజరాత్ లోని సౌరాష్ట్ర, సౌత్ గుజరాత్ ప్రాంతాల్లో ప్రధాని ర్యాలీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సౌత్ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో డిసెంబర్ 9వ తేదీ మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో నవంబర్ 27, 29వ తేదీల్లో జరిగే పర్యటనల్లో ప్రధాని నరేంద్ర మోడీ 8 ర్యాలీల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 8 ర్యాలీల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసగించనున్నారు.

PM Narendra Modi lead BJP poll campaign in Gujarat on November 27, 29

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ తో సహ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చిత్తిస్ ఘడ్ సీఎం రమన్ సింగ్, ఉమాభారతి తదితరులు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

గుజరాత్ సీఎంకు రూ. 9 కోట్లు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి రూ. 140 కోట్ల ఆస్తులు, కుబేరుడితో సీఎం ఢీగుజరాత్ సీఎంకు రూ. 9 కోట్లు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి రూ. 140 కోట్ల ఆస్తులు, కుబేరుడితో సీఎం ఢీ

ప్రధాని మోడీ కంటే రెండు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ (నవంబర్ 24, 25 శుక్ర, శనివారం) రెండు రోజుల పాటు గుజరాత్ లో ప్రచారం మొదలు పెట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పోర్ బందర్, ఆహ్మదాబాద్, దాహోర్, గాంధీనగర్, సనంద్ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ప్రతినిధి మనీశ్ జోషి తెలిపారు.

English summary
PM Narendra Modi will be back in his home state to campaign on November 27 and 29, when he is slated to address eight rallies across Saurashtra and south Gujarat, where polling for the first phase of assembly elections will be held on December 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X