వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనారీటీ విద్యార్థులకు 5 కోట్ల స్కాలర్‌షిప్స్... మంత్రి నఖ్వీ...

|
Google Oneindia TeluguNews

దేశంలో పెరుగుతున్న మతతత్వాన్ని తగ్గుముఖం పట్టించేందుకు మోడీ అనేక చర్యలు తీసుకుంటున్నారని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఈనేపథ్యంలోనే మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రానున్న అయిదు సంవత్సరాల్లో మైనారీటీ విద్యార్థులకు అయిదు కోట్ల స్కాలర్‌షిప్‌లను అందించనుందని ఆయన ప్రకటించారు. కాగా వీటిలో యాబై శాతం మందికి వీటిని అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక వీటిని ప్రీ మెట్రిక్ నుండి పోస్ట్ మెట్రిక్ తోపాటు వివిధ వృత్తి విద్యా కోర్సులు చదువు కుంటున్న విద్యార్థులకు అందిస్తామని ఆయన ప్రకటించారు.

రాజకీయాలకు అతీతంగా మైనారీటీల అభివృద్ది..

రాజకీయాలకు అతీతంగా మైనారీటీల అభివృద్ది..

ఢిల్లీలోని మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 65వ జనరల్ బాడీ సమావేశంలో పాల్గోన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఆరోగ్యకరమైన అభివృద్దిని సాధిందుకు ప్రధాన మంత్రి మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. దీంతోపాటు పెరుగుతున్న మతతత్వ వ్యాధిని కూడ తోలగించేందుకు రాజకీయాలకు అతీతంగా వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

మదర్సా టీచర్లకు ఆధునిక సబ్జెక్ట్స్ పై శిక్షణ

మదర్సా టీచర్లకు ఆధునిక సబ్జెక్ట్స్ పై శిక్షణ

మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న మదర్సాల్లోని విద్యను అందిస్తున్న మదర్సా టీచర్స్‌కు విద్యార్థులకు ఇంగ్లీష్, మాథ్స్, హిందితోపాటు కంప్యూటర్ బాషను భోదించేందుకు వీలుగా వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.దీని వల్ల మదర్సాలలో చదువుకునే విద్యార్థులు మెయిన్ స్ట్ర్ర్రీమ్ విద్యావిధానంలోకి అడుగుపెడతారని తెలిపారు. దీని వల్ల మదర్సా విద్యార్థులు కూడ దేశ అభివృద్దిలో పాలుపంచుకునే అవకాశం కల్గుతుందని అన్నారు.ఇక ఈ కార్యక్రమాన్ని రానున్న నెలలోనే ప్రారంభిస్తామని అన్నారు.

మైనారీటీ విద్యార్థులకు ఉపాధిలో శిక్షణ

మైనారీటీ విద్యార్థులకు ఉపాధిలో శిక్షణ

మరోవైపు స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థులతోపాటు మైనారీటీల పిల్లలను చదువుకు దగ్గర చేసేందుకు దేశవ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రామాలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తామని అన్నారు. మరోవైపు మైనారీటీలకు వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వారిక ప్రత్యేక కోచింగ్ ఇవ్వడంతోపాటు ప్రత్యేక సదుపాయలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

English summary
PM Narendra Modi-led NDA government has announced scholarships for five crore students from minority communities, including 50 per cent girls, in the next five years. Union minister Mukhtar Abbas Naqvi on Tuesday told media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X