వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్టులో.. కేంద్ర మంత్రివర్గ విస్తరణ!?

కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారైంది. వచ్చే నెల (ఆగస్టు)లో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. కొత్తగా పలువురికి కేబినెట్‌ బెర్త్‌లు దక్కనున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారైంది. వచ్చే నెల (ఆగస్టు)లో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. కొత్తగా పలువురికి కేబినెట్‌ బెర్త్‌లు దక్కనున్నాయి.

మంత్రుల శాఖల్లోనూ మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. మహాఘట్‌బంధన్‌ నుంచి విడిపోయి బీజేపీతో జతకట్టిన జేడీయూ కేబినెట్‌లో చేరనుంది. జేడీయూ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్‌ ఉంది.

PM Narendra Modi likely to go for cabinet expansion

ఓ వైపు కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా, మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడం, అనిల్‌దవే ఆకస్మిక మరణంతో కేబినెట్‌లో ఖాళీలు ఏర్పడ్డాయి.

దీంతో రక్షణ, పర్యావరణ వంటి కీలక శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రి హర్షవర్ధన్ ఆ రెండు శాఖలను అదనంగా నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో పలు మార్పులు-చేర్పులు జరగవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం అదనపు శాఖలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రులకు ఆ భారం నుంచి సడలింపు ఇవ్వొవచ్చునని, కొత్తమవాళ్లకు అవకాశం కల్పించవచ్చునని తెలుస్తోంది.

English summary
Prime Minister Narendra Modi is likely to go for a Cabinet expansion as senior minister M. Venkaiah Naidu’s almost certain election as the next vice president will leave two heavy weight portfolios without a cabinet minister. Naidu, already submitted his resignation, to union minister for information and broadcasting, and urban development. Already, two key ministries—defence and environment—are without a full-time minister. Finance minister Arun Jaitley and science and technology minister Harsh Vardhan are holding the additional charge of these two portfolios respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X