వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైసల్మీర్‌కు మోదీ... దీపావళి రోజు ఆ ఆనవాయితీని కొనసాగించనున్న ప్రధాని..

|
Google Oneindia TeluguNews

దీపావళి పర్వదినాన భారత సైనికులతో గడిపే ఆనవాయితీని కొనసాగిస్తూ... ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా పండుగ పూట సైనికులతో గడిపే అవకాశం ఉంది. శనివారం(నవంబర్ 14) రాజస్తాన్‌లోని జైసల్మీర్‌‌ సరిహద్దులో భారత సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకలను జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ... పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా ప్రముఖ జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. మోదీతో పాటు డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్,ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే కూడా జైసల్మీర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా మోదీ సైనికులతో ముచ్చటించే అవకాశం ఉంది. సైనికుల్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు మోదీ ఇలా ప్రతీ ఏటా దీపావళి రోజున సైన్యంతో గడుపుతున్నారు.2014లో మొదటిసారి ప్రధాని అయినప్పటినుంచి ప్రతీ ఏడాది దీపావళి పండుగను ఆయన సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు. 2014లో సియాచిన్‌లో సైనికులతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 2015లో పంజాబ్ సరిహద్దులో,2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని టిబేటన్ బోర్డర్ పోలీస్‌తో,2017లో కశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో,2018లో పంజాబ్ సరిహద్దులో,2019లో జమ్మూకశ్మీర్‌లో మోదీ సైన్యంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

PM Narendra Modi likely to celebrate this diwali at jailsalmer border

కాగా,శుక్రవారం(నవంబర్ 13) రాత్రి ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు.'దేశాన్ని రక్షిస్తున్న మన సైనికులకు వందనంగా ఈ దీపావళి పండుగ రోజున ఒక దీపాన్ని వెలిగించండి. అనితరసాధ్యమైన వారి ధైర్యానికి కృతజ్ఞత చూపేందుకు మాటలు సరిపోవు. సరిహద్దులో దేశానికి రక్షణగా ఉన్న సైనికుల కుటుంబాల పట్ల కూడా మనం కృతజ్ఞతతో ఉండాలి.' అని మోదీ సూచించారు.

లదాఖ్‌లోని భారత్-చైనా సరిహద్దు ప్రాంతం గాల్వన్ లోయలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత... సైన్యంలో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు ప్రధాని మోదీ లేహ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్,ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే కూడా లేహ్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా సైనికులతో మాట్లాడిన ప్రధాని అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

Recommended Video

What Barack Obama Said About PM Modi In 2015 | Oneindia Telugu

English summary
In line with his practice of celebrating Diwali with soldiers since the NDA government came to power in 2014, Prime Minister Narendra Modi is expected to spend the festival with troops deployed at a forward base in the western sector, officials familiar with the development said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X