వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త నోట్ల ముద్రణ: ఎక్కడెంత?, మరో 6నెలలు పడుతుందా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దైన నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త నోట్ల భర్తీకి మరింత సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నోట్లను ముద్రించే ముద్రణాలయాల సామర్థ్యాన్ని బట్టి చూస్తే మరో ఆరు నెలల వరకు పట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రూ.500 నోట్లు కొత్తవి ముద్రించేందుకు
ఆరు నెలల సమయం పడుతుందని గణాంకాలు సైతం వెల్లడిస్తున్నాయి.

500, 1,000 నోట్ల స్థానంలో కొత్త 500, 2,000 నోట్లను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆశావాదమే అవుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

నాసిక్, దేవాస్ 40శాతం

కాగా, నాసిక్, దేవాస్ ప్రెస్‌లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాటిని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా వార్షిక నివేదిక ప్రకారం ఈ రెండు ముద్రణాలయాలు దేశంలోని మొత్తం కరెన్సీలో ఏటా 40 శాతం నోట్లను ముద్రించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

60శాతం మైసూరు

ఇక సాల్బోని, మైసూరు ముద్రణాలయాలు భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్)లో భాగంగా ఉన్నాయి. ఇవి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి చెందినవి. దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 60 శాతం నోట్లను ఇవి ముద్రిస్తున్నాయి. ఇవి ఒక ఏడాదిలో రెండు షిఫ్టులు పనిచేస్తే 1600 కోట్ల నోట్లను ముద్రించగలవు.

PM Narendra Modi may need six more months to replace junk banknotes

కాగా, మొత్తం మన ముద్రణాలయాలు రెండు షిఫ్టుల్లో పనిచేస్తే ఏడాదికి 26.66 వందల కోట్ల కరెన్సీని ముద్రించగలవు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్నట్టు అవి మూడు షిఫ్టుల్లో పనిచేస్తే నాలుగువేల కోట్ల కరెన్సీని (అవి ఏ నోట్లయినా సరే) ముద్రించగలవు.

గణాంకాల ప్రకారం.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయకముందు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ.17.54 లక్షల కోట్లు. ఇందులో 45 శాతం రూ.500 నోట్లు రూ.7.89 లక్షల కోట్ల విలువైనవి ఉండగా, 39 శాతం వెయ్యి నోట్లు రూ.6.84 లక్షల కోట్ల విలువైనవి ఉన్నాయి. చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో వీటి విలువ 84 శాతం. మిగిలినవి రూ.5 నుంచి రూ.100 నోట్ల వరకు ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే.. రూ.500 నోట్లు 1578 కోట్లు, రూ.1000 నోట్లు
684 కోట్లు చెలామణిలో ఉన్నాయి.

ప్రస్తుతం ప్రభుత్వం రూ.684 లక్షల కోట్ల విలువైన రూ.1000 నోట్ల స్థానంలో రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ విలువకు తగినట్లుగా 342 కోట్ల నోట్లను ముద్రిస్తే సరిపోతుంది. 2000 నోట్ల ముద్రణ సెప్టెంబర్‌లోనే ప్రారంభమైందని చెప్తున్నారు కాబట్టి, ఇప్పటికే అవసరమైన నోట్ల ముద్రణ జరిగి ఉంటుందని భావించవచ్చు.

నవంబర్ 10న రూ.500 నోట్ల ముద్రణను ప్రారంభించి ఉంటే మన ముద్రణాలయాలు రెండు షిఫ్టులు పనిచేసినా 1578 లక్షల కోట్ల నోట్ల ముద్రణకు 5.9 నెలలు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మే నెల వరకు పూర్తి స్థాయిలో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని విశ్లేషిస్తున్నారు.

English summary
Prime Minister Narendra Modi's administration may need until May 2017 to replenish the stock of now worthless bills, according to Saumitra Chaudhuri, an economist who advised Modi's predecessor. The government on Nov. 8 banned 500 ($7.5) and 1,000 rupee notes in a surprise move against graft and tax evasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X