వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వంలో కొనసాగాలంటూ అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లి చర్చించిన ప్రధాని నరేంద్ర మోడీ...

|
Google Oneindia TeluguNews

మోడీ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందుగా తనకు ప్రభుత్వంలో ఎలాంటీ బాద్యతలు ఇవ్వవద్దంటూ ఆర్డిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన నేపథ్యంలోనే ప్రధాని మోడీ అరుణ్ జైట్లీతో చర్చించేదుకు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో అరుణ్ జైట్లీ రాసిన లేఖను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ప్రభుత్వంలో కొనసాగాలని కోరే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

మోడీ ప్రభుత్వంలో కీలక ఆర్ధికశాఖ భాద్యతలు నిర్వహించిన అరుణ్ జైట్లీ రెండవసారీ అధికారం చేపడుతున్న ప్రభుత్వంలో మాత్రం అనారోగ్యం రిత్యా ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండనున్నారు. కాగా గత సంవత్నరన్నర కాలంగా ఆనారోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోంటున్నానని డాక్టర్ల సలహా మేరకు భవిష్యత్‌లో కొంతకాలం తన ఆరోగ్యంపై ద‌ృష్టి సారించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కోన్నారు. ఇలాంటీ నేపథ్యంలో తాను ప్రభుత్వంలో ఏలాంటీ బాద్యతలు చేపట్టలేనని తెలుపుతూ మోడీకి లేఖ రాశారు. అయితే ఇదే విషయాన్ని మోడీకి నేరుగా చెప్పినట్టు ఆయన స్పష్టం చేశారు.

PM Narendra Modi Meets Arun Jaitley At His Residence

ఆయన ఇప్పటి వరకు ఆర్దిక మంత్రిగా కొనసాగిన నేపథ్యంలో 2017లో చేపట్టిన జీఎస్టీలాంటీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.కాగా అరుణ్ జైట్లీ 2014లో ఆర్దిక శాఖతో పాటు ఢిఫెన్స్ వ్యవహారాలను కూడ చూశాడు. కొద్ది కాలం తర్వాత పూర్తిగా ఆర్ధిక శాఖ మీదే దృష్టి సారించాడు.రెండవ సారి రాజ్యసభ సభ్యుడిగా గత సంవత్సరమే ఉత్తరప్రదేశ్ నుండి ఎన్నికయ్యాడు.

English summary
hours after Arun Jaitley wrote a letter to the prime minister requesting to opt out of his new government, PM Modi is expected to meet Arun Jaitley residence today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X