వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియన్ ఆఫ్ ది ఇయర్‌గా మోడీ: సింగపూర్ పత్రిక ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

సింగపూర్: ఈ ఏడాదికి ప్రధాని నరేంద్ర మోడీ అత్యుత్తమ ఆసియన్ నాయకుడిగా ఎంపికయ్యారు. సింగపూర్‌లోని అత్యంత ప్రజాదరణ గల ‘ది స్ట్రెయిట్‌ టైమ్స్‌' దినపత్రిక సంపాదకుల బృందం ఏడాది కాలంగా అధ్యయనం జరిపి ఈ మేరకు ప్రకటించింది.

ప్రధాని పదవికి నరేంద్ర మోడీ కొత్త అయినప్పటికీ, ఆసియాలో తనదైన ముద్ర ఏర్పరచుకున్నారని ఆ పత్రిక ప్రశంసించింది. ఏడాది కాలంలో ఆసియా ఖండంలో కానీ, వారి దేశంలో కానీ విశేష ప్రభావాన్ని చూపిన ఆసియాకు చెందిన వ్యక్తుల్ని సింగపూర్ దినపత్రిక 2012 నుంచి ఒకరిని ఎంపిక చేస్తోంది. ఈ ఏడాదికి గానూ నరేంద్ర మోడీని ఎంపిక చేసింది.

అభివృద్ధి దృష్టి ఉన్న నేతగా, పొరుగు దేశాలతో సత్సంబంధాల నెలకొల్పడంలో మోడీ తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించింది. రాజకీయంగా, సామాజికంగా మోడీ దేశాన్ని శక్తిమంతం చేశారని పేర్కొంది.

 PM Narendra Modi named 'Asian of the Year' by Singapore daily


అదే సమయంలో దేశాన్ని ప్రభావవంతంగా తీర్చిదిద్దుతాననే భరోసానిస్తూ దేశ ప్రజలను, ప్రపంచాన్ని ఆకట్టుకున్నారని పత్రిక పేర్కొంది.

ఆయనకు, భారత్‌కు విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నామని పత్రిక సంపాదకుడు వారెన్‌ ఫెర్నాండెజ్‌ పేర్కొన్నారు. చైనా ఆర్థికంగా మందగిస్తున్న తరుణంలో, జపాన్‌ మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మేక్‌ ఇన్‌ ఇండియా పేరుతో పెట్టుబడులను స్వాగతించడం గొప్ప విషయంగా అభివర్ణించారు.

ప్రధాని మోడీ వెసులుబాటును బట్టి ఆయనకు అందజేయాలనుకుంటున్నట్లు ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్' విదేశీ సంపాదకుడు రవి వెల్లూరు తెలిపారు. నిరుడు ఈ పురస్కారాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా అందుకున్నారు. 2012లో మయన్మార్ అధ్యక్షుడు థీన్‌సేన్‌కు అందజేశారు.

English summary
Prime Minister Narendra Modi was on Friday named 'Asian of the Year' for being development-focused leader of India by editors of Singapore's leading daily, The Straits Times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X