వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ప్రధాని మోడీనే..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ప్రకటనకు ఇంకా మూడు రోజులు సమయం ఉంది. ఐతే టైమ్స్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'ను సోమవారం ప్రకటించేది భారత ప్రధాని నరేంద్రమోడీ పేరునే. కారణం, టైమ్స్ ప్రజాభిప్రాయ సేకరణలో బుధవారం నాటికి మోడీ 12.8 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

ఇక మోడీ తర్వాత రెండో స్ధానంలో కొనసాగుతున్నా ఫెర్గూసన్ ఆందోళనకారులు 10.1 శాతం ఓట్లతో మోడీ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. దీంతో మోడీ కంటే ఎక్కువ ఓట్లను సాధించడం అసాధ్యమని పోల్ నిర్వాహకులే చెబుతున్నారు.

ప్రతి ఏటా డిసెంబర్ 6న ప్రజాభిప్రాయ సేకరణను ముగించే టైమ్స్, 8న విజేతను ప్రకటిస్తుంది. ఇక ఈ పోటీలో మూడో స్థానానికి ఎగబాకిన హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమనేత జోషువా ఓంగ్ 7.5 ఓట్లను సాధించారు. పాకిస్థాన్ బాలల హక్కుల ఉద్యమకర్త మలాలా యూసుఫ్ జాయ్ 5.2 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

 PM Narendra Modi Regains Top Position in 'Time Person of the Year' Poll

అత్యంత ధైర్యసాహసాలు చూపి ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించిన వైద్యులు, నర్సులు 4.5 శాతం ఓట్లను దక్కించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (4.1 శాతం ఓట్లు)ను ఆరో స్థానానికి దిగజార్చేసి ఐదో స్థానానికి ఎగబాకారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఈ జాబితాలో కేవలం 2.3 శాతం ఓట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు.

టైమ్ మ్యాగజైన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోల్ వోటింగ్ సెప్టెంబర్ 6వ తేదీ 11:59 PMకు ముగుస్తుంది. డిసెంబర్ 10వ తేదీన టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ను ప్రకటిస్తుంది. అదే రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కావడం విశేషం. ప్రధాని నరేంద్రమోడీకి వోట్ చేసి టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'‌కు ఎంపికయ్యేలా చూడండి.

English summary
PM Modi, according to latest results, has 12.8 per cent of the total votes polled and is followed by Ferguson protesters with 10.1 per cent. Joshua Wong, face of the Hong Kong pro-democracy movement, is placed third with 7.5 per cent, while Pakistan's teen rights activist Malala Yousafzai is fourth with 5.2 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X