వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలిదశ ఎన్నికలు: 70 శాతం పోలింగ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gujarat Elections Polling : More Than 30% Polling Till Noon | Oneindia Telugu

అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన గుజరాత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 182 స్థానాలకు గానూ.. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాల్లోని 89 స్థానాలకు శనివారం తొలివిడుత పోలింగ్‌ జరిగింది. కొంత మందకోడిగా సాగినప్పటికి శనివారం సాయంత్రం 5గంటల వరకు 70శాతం ఓటింగ్ నమోదుకావడం గమనార్హం.

గుజరాత్‌లో తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 70శాతం పోలింగ్‌ నమోదైనట్లు గుజరాత్‌ చీఫ్‌ ఎన్నికల అధికారి బీబీ.స్వావిన్‌ ప్రకటించారు. కాగా, డిసెంబరు 14న రెండో విడత పోలింగ్‌ జరగనుండగా.. 18న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

గుజరాత్‌లో ఇదీ పరిస్థితి: బీజేపీకి 'టఫ్ టైమ్'.., వ్యాపార వర్గాలు ఏమంటున్నాయంటే?..గుజరాత్‌లో ఇదీ పరిస్థితి: బీజేపీకి 'టఫ్ టైమ్'.., వ్యాపార వర్గాలు ఏమంటున్నాయంటే?..

తొలి విడత ఎన్నికల బరిలో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని సహా 977 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 2.11 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 14న మిగిలిన స్థానాలకు రెండో విడతలో పోలింగ్‌ జరగనుంది. గుజరాత్ ఎన్నికల్లో ఈసారి కమలదళానికి ప్రతికూలత ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో ఎన్నికలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

గుజరాత్ పరిస్థితి ఇదీ: కాంగ్రెసు దశ తిరగుతుందా...గుజరాత్ పరిస్థితి ఇదీ: కాంగ్రెసు దశ తిరగుతుందా...

లైవ్ అప్‌డేట్స్:

  • సాయంత్రం 5గంటల వరకు 70శాతం ఓటింగ్ శాతం నమోదైంది.
  • సాయంత్రం 4 గంటల వరకు గుజరాత్‌లో 47.28 శాతం ఓట్లు పడ్డాయి
  • మధ్యాహ్నం 2 గంటల వరకు గుజరాత్ తొలి దశ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదైంది.
  • మధ్యాహ్నాం 2గం.కల్లా 40.47శాతం పోలింగ్ నమోదైంది.
  • ఈవీఎంలను బ్లూటూట్ కు కనెక్ట్ చేశారన్న ఫిర్యాదుతో ఎన్నికల కమీషన్ అధికారులు పోరుబందర్ లోని తక్కర్ ప్లాట్ బూత్ వద్దకు వచ్చారు.
  • ఓడిపోయిన ప్రతీసారి ఈవీఎంల పనితీరుపై సందేహాలు లేవనెత్తడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని జితేంద్ర సింగ్ అన్నారు.
  • పోలింగ్ బూత్ లలో వైఫై అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈవీఎంలను రిగ్గింగ్ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
  • ఈవీఎంలపై ప్రతీ ఎన్నికల్లోను విమర్శలు, ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇదేమి కొత్త కాదు. ఎలక్షన్ కమీషన్ అవన్నీ చూసుకుంటుంది-అరుణ్ జైట్లీ
  • 2012 గుజరాత్ ఎన్నికల్లో 72.02శాతం పోలింగ్ నమోదు కాగా.. అంతకుముందు 2007-59.77శాతం, 2002-59.30శాతం, 1998-59.30శాతం, 1995-64.39శాతం పోలింగ్ నమోదైంది.
  • కాంగ్రెస్ ప్రచారం విఫలమైందని, బీజేపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేయబోతుందని, కమలదళ విజయం ప్రతిధ్వనించడం ఖాయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
  • మధ్యాహ్నాం 12.30గం. వరకు 31శాతం పోలింగ్ నమోదైంది.
  • పార్ది నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాను దేశాయి బంధువు ఓటర్లకు రూ.100నోట్లు పంచుతూ కెమెరాకు చిక్కాడు.

  • రెండో విడుత ఎన్నికల కోసం ఆయా నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి సారించింది. శనివారం లూనావాడలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా తిరస్కరించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ముస్లింలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించిందన్నారు.
  • 11గం. వరకు 20.9శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.
  • ఏయే పోలింగ్ బూత్ లలో ఈవీఏంలు మొరాయించాయో.. అక్కడే తక్షణమే వాటిని మార్చాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు.

  • రెండు ఈవీఎం మెషీన్లు మొరాయించడంతో వేరే వాటిని తెప్పించాం. ఒక వివిపాట్(వోటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) మెషీన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అయితే దీన్ని టెక్నికల్ ప్రాబ్లమ్ అనుకోవడానికి లేదు. ప్రస్తుతం అన్ని సమస్యలను పరిష్కరించాం. ఓటింగ్ సజావుగా సాగుతోంది- విపుల్ గోటి, మాస్టర్ ట్రైనర్, ఎలక్షన్ కమిషన్, సూరత్ (వరచ్చా).
  • ఉదయం 10గం. వరకు 9.77శాతం పోలింగ్ నమోదైంది.
  • కాంగ్రెస్ నేత అర్జున్ మొద్వాడియా పోర్బందర్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు బొకిరియాపై మొద్వాడియా పోటీ చేస్తున్నారు.

  • కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్ భరుచ్ అంక్లేశ్వర్ పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 110 పైచిలుకు స్థానాలు గెలుస్తుందన్నారు.

  • భారత జట్టు క్రికెటర్ ఛటేశ్వర్ పూజారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్‌కోట్ లోని రావి విద్యాలయ బూత్‌లో ఆయన ఓటు వేశారు.

  • కొత్తగా పెళ్లయిన ఓ జంట తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భరుచ్ బహుమాలి భవనంలో వారు ఓటేశారు.

  • నవ్‌సారి పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం మొరాయించింది. 40నిమిషాల తర్వాత సమస్య పరిష్కారమవడంతో ప్రస్తుతం పోలింగ్ సజావుగా సాగుతోంది.
  • రత్నాల్ పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం చాలాసేపు మొరాయించింది. అధికారులు సమస్య పరిష్కరించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
  • దాదాపు ఐదు జిల్లాలోని పోలింగ్ బూత్ లలో ఈవీఎం సమస్యలు తలెత్తాయి.
  • గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
PM Narendra Modi's home state prepares to vote in first phase of prestige poll

  • గుజరాత్ లో 150సీట్లు తాము గెలబోతున్నామని ఆ పార్టీ బీజేపీ చీఫ్ జితూభాయ్ వఘాని మీడియాతో ధీమా వ్యక్తం చేశారు.
  • గుజరాత్ ఎన్నికలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. ఎన్నికల్లో ఓటర్ల ప్రమేయమే ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని రాహుల్ పేర్కొన్నారు.
PM Narendra Modi's home state prepares to vote in first phase of prestige poll

  • బీజేపీ గుజరాత్ చీఫ్ జితూభాయ్ వఘాని భావ్‌నగర్‌లో తన ఓటు హక్క వినియోగించుకున్నారు.
  • శుక్రవారం రాత్రి గుజరాత్ ఎన్నికలపై ట్వీట్ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. బీజేపీ 150స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కంచుకోటలో బీజేపీకి కష్టాలు:

2002 నుంచి గుజరాత్‌కు బీజేపీ కంచుకోటగా ఉండటం.. ప్రస్తుత పరిస్థితులు అధికార పార్టీకి ప్రతికూలంగా ఉండటంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.2012లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం తొలి దశ జరుగుతోన్న 89 స్థానాల్లో 63 చోట్ల బీజేపీ గెలవగా, 22 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కానీ పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్, దళిత నాయకుడు జిగ్నేశ్ మేవాని, ఓబీసీల కోసం ఉద్యమించిన అల్ఫేష్ ఠాకూర్ వంటి యువ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగడంతో ఆ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి.

PM Narendra Modi's home state prepares to vote in first phase of prestige poll

అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు విస్తృత ప్రచారం చేశారు. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో.. ఇక్కడ ఎక్కువ సీట్లు సాధించే పార్టీకే విజయావకాశాలు ఎక్కువ ఉండనున్నాయి.

మోడీ స్పందన:

'తొలి విడుత గుజరాత్ ఎన్నికల పోల్స్ ప్రారంభమయ్యాయి. నేనొకటే అభ్యర్థిస్తున్నా.. భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించాలి. ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనాలి.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

English summary
It's the biggest Assembly election of the year. Voters in Prime Minister Narendra Modi's home state will head to polling booths in 89 constituencies and answer this simple question: Should the BJP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X