వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై ఎన్జీవోల కుట్ర: మోడీ సంచలన వ్యాఖ్య (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్/కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. విదేశీ విరాళాల పైన ప్రశ్నించినందుకే ఆందోళనలు అన్నారు. కొన్ని ఎన్జీవో, యూరియా కంపెనీల పని అని మండిపడ్డారు.

ప్రధాని మోడీ ఆదివారం నాడు ఒడిశా, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చాయ్‌వాలా ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోవడం లేదని, అందుకే ప్రధానిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.

ఈమధ్య మీరు చూస్తున్నారని, తనపై వివిధ రూపాల్లో దాడి చేస్తున్నారన్నారు. కొంతమంది అదే పనిమీద ఉన్నారన్నారు. గతంలో మాదిరిగా రసాయన కర్మాగారాలకు యూరియా తరలిపోకుండా వేపపూత వేయిస్తున్నామని, ఈ చర్యల వల్ల ఇంతకాలం దోచుకున్న రసాయన కర్మాగారాలకి తనపై కోపం వచ్చిందన్నారు.

ఇలాంటి సమయంలో మోడీకి వ్యతిరేకంగా ఏదైనా కజరుగుతుంటే వారు సాయపడకుండా ఉంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానికి వ్యతిరేకంగా వారు కేకలు వేయకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. నా ప్రతిష్టను దెబ్బతీయాలని కొన్ని సంస్థలు దెబ్బతీస్తున్నాయని కొన్ని స్వచ్చంధ సంస్థలపై ఆఘ్రహం వ్యక్తం చేశారు.

విదేశీ ధనానికి ఆ సంస్థలు లెక్కలు చెప్పడం లేదన్నారు. అది అడిగినందుకు తన పైన దాడికి పాల్పడుతున్నారన్నారు. ఆయన ఒడిశాలోని బర్‌గఢ్ రైతు ర్యాలీలో స్వచ్చంధ సంస్థల పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.

ఒడిశాలో ప్రధాని మోడీ

ఒడిశాలో ప్రధాని మోడీ

కేంద్ర సర్కారును అస్థిరపరచడానికి, తన ప్రతిష్ఠను దిగజార్చడానికి కొన్ని వర్గాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను చూసి వెనక్కి తగ్గేది లేదనీ, అభివృద్ధి పథాన్ని వీడకుండా తన పనిని కొనసాగిస్తానన్నారు.

ఒడిశాలో ప్రధాని మోడీ

ఒడిశాలో ప్రధాని మోడీ

ఒడిశాలోని బరగఢ్‌లో ఆదివారం జరిగిన కిసాన్‌ సభలో ఆయన మాట్లాడారు. తాను చేపట్టిన కొన్ని చర్యలు ఈ కుట్రదారులకు ఇబ్బందికరంగా మారడమే దీనంతటికీ కారణమని చెప్పారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకు విదేశీ నిధులు వస్తున్నాయనీ, తమ ప్రభుత్వం దానిని తప్పు పట్టకపోయినా ఆ లెక్కల్ని అడగడం ప్రారంభించే సరికి వారంతా కలిసి మోడీని కొట్టండి... మోడీని కొట్టండి అని నినదిస్తున్నారని చెప్పారు.

వస్తున్న డబ్బంతా ఎలా ఖర్చవుతోందో దేశం

వస్తున్న డబ్బంతా ఎలా ఖర్చవుతోందో దేశం

తెలుసుకోవాలనుకుంటోందన్నారు. ఇలాంటి రుగ్మతల నుంచి దేశాన్ని బయటపడేయడానికే ప్రజలంతా నన్ను ఎన్నుకున్నారన్నారు. నేను ఆ పనిలోనే ఉన్నానని, తనకు వ్యతిరేకంగా ఎవరు ఏమైనా చెప్పుకోనీయండి... నాకు మీరప్పగించిన అభివృద్ధి పథం నుంచి వీడిపోయేది లేదని, నా ప్రయత్నాలను ఆపను... విసిగిపోను... వారికి తలొగ్గనని చెప్పారు.

ఒడిశాలో ప్రధాని మోడీ

ఒడిశాలో ప్రధాని మోడీ

తనను వ్యతిరేకిస్తున్నవారికి ఏయే అంశాలు బాధ కలిగిస్తున్నాయో తనకు తెలుసుననీ, అయితే దేశాన్ని దోచుకోవడాన్ని లేదా నాశనం చేయడాన్ని అనుమతించేది లేదన్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో మొదటిసారిగా రైతు ప్రభుత్వం వచ్చిందనీ, తమ పాలనలో అన్నదాతలకు అన్ని విధాలుగా లాభం చేకూరుస్తామన్నారు.

ఒడిశాలో ప్రధాని మోడీ

ఒడిశాలో ప్రధాని మోడీ

2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని, దానిపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. అంకుర పరిశ్రమలు కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పారు.

ఒడిశాలో ప్రధాని మోడీ

ఒడిశాలో ప్రధాని మోడీ

తాను ప్రజల ప్రధాన సేవకుడిననీ, కేంద్రం-రాష్ట్రాలు కలిసి స్వాతంత్య్ర సమరయోధుల కలల్ని నిజం చేయాలని ప్రధాని మోడీ చెప్పారు.

నయా రాయపూర్‌లో ప్రధాని మోడీ

నయా రాయపూర్‌లో ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఛత్తీస్ గఢ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదలు, దళితులు, అణగారిన వర్గాల బతుకుల్లో వెలుగులు నింపడానికే 'రూర్బన్‌ మిషన్‌' పేరుతో దేశంలో 300 గ్రామాలను 'పట్టణ వృద్ధి కేంద్రాలు'గా తీర్చిదిద్దబోతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

చత్తీస్‌గఢ్‌లో మోడీ

చత్తీస్‌గఢ్‌లో మోడీ

వలసలను ఆపడం దీని ప్రధానోద్దేశమన్నారు. మునుపటి ప్రభుత్వాలు ఈ దిశగా తగినంత కృషి చేయలేకపోయాయనీ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతమైన డొంగర్‌గఢ్‌లో ఆదివారం ఆయన 'శ్యామాప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్'ను ప్రారంభించారు.

చత్తీస్‌గఢ్‌లో మోడీ

చత్తీస్‌గఢ్‌లో మోడీ

రూర్బన్‌ మిషన్‌ కింద దేశంలో 300 గ్రామీణ కేంద్రాలను అధునాతన సదుపాయాలతో పట్టణ సమూహాలుగా తీర్చిదిద్దుతామని మోదీ చెప్పారు. ఒక్కోచోట కనీసం నాలుగు పరిసర గ్రామాలను కలిపి అభివృద్ధి చేస్తామన్నారు. తొలి ఏడాదే 100 కేంద్రాలను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

చత్తీస్‌గఢ్‌లో మోడీ

చత్తీస్‌గఢ్‌లో మోడీ

ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోవడం కోసం గొర్రెల్ని విక్రయించేసిన 104 ఏళ్ల మహిళ కున్వర్‌బాయి సహా పలువురు గ్రామస్తుల్ని ప్రధాని సత్కరించారు. తన ప్రసంగాలను చూపించకపోయినా ఫర్వాలేదనీ, ఇలాంటి ప్రజల గురించి మాత్రం తెలపాలని జాతీయ మాధ్యమాలకు చెబుతానని ఆయనన్నారు. బహిరంగ మలవిసర్జనకు స్వస్తి చెప్పడం ద్వారా మాతృమూర్తులకు గౌరవం కల్పించినవారికి శిరసువంచి నమస్కరిస్తున్నానన్నారు.

కోల్‌కతాలో మోడీ

కోల్‌కతాలో మోడీ

చెక్కు చెదరని ఆధ్మాత్మిక చేతన కారణంగానే భారతీయ నాగరికత అనేక ఏళ్లుగా మనుగడ సాగిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

కోల్‌కతాలో మోడీ

కోల్‌కతాలో మోడీ

కోల్‌కతలో గౌడియా మిషన్‌ శతాబ్ది ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. అనేకమార్లు విదేశీ దాడులకు గురైనా భారత ఆధ్యాత్మిక పునాదులు ఏమాత్రం దెబ్బతినలేదన్నారు.

కోల్‌కతాలో మోడీ

కోల్‌కతాలో మోడీ

దుష్టశక్తులపై పోరాటమే పునాది అయిన భక్తి ఉద్యమం... దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రాతిపదికగా నిలిచిందన్నారు. ఆధ్యాత్మికతే సమాజాన్ని కలిపి ఉంచుతుందనీ, కులాలు కాదనీ ఆయనన్నారు. గౌడియ మఠంలో పూజల్లో మోడీ పాల్గొన్నారు. మోడీ కోల్‌కత నుంచి తన నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు.

English summary
Prime Minister Narendra Modi on Sunday said that he is a victim of a conspiracy by non-governmental organisations to "finish" him and remove his government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X