వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి భారత రత్న ప్రకటించాలి...! ఆయన యుగపురుషుడు.. పార్లమెంట్‌లో డిమాండ్

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోడితో పలువురు ప్రశంశలు కురిపించారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్ జీరో అవర్‌లో బీజేపీ మధ్యప్రదేశ్ ఎంపీ ప్రధాని నరేంద్రమోడిని యుగపురుషుడుగా అభివర్ణించాడు. ఈనేపథ్యంలోనే మోడీ భారత విశిష్ట పురస్కారమైన భారత రత్నను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే ఎంపీకి మద్దతుగా సుమారు 70మంది ఎంపీలు పార్లమెంట్‌లో జైకోట్టారు. మోడీ నిర్ణయాన్ని యావత్తు దేశం స్వాగతిస్తుందని ఎంపీలు పేర్కోన్నారు.

అంత్యంత క్లిష్టమైన కశ్మీర్ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ పలువురు ప్రజా ప్రతినిధులు పూర్తి మద్దతు తెలపగా,సిద్దంతపరంగా వ్యతిరేకించే పలు విపక్ష పార్టీలు కూడ ఆర్టికల్ 370కు సహకరించారు. ఈనేపథ్యంలోనే దేశం మొత్తం మోడీ నిర్ణయం పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి కేంద్రం నెగ్గించుకుంది. మరోవైపు మధ్యహ్నం లోక్‌సభలో కూడ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సంధర్భంగా మోడీ నిర్ణయంపై ఆపార్టీ ఎంపీలు జీరో అవర్‌లో ప్రస్థావించారు.

pm narendra modi should be awarded Bharat Ratna

ఈ సంధర్భంగా మాట్లాడిన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గుమాన్ సింగ్ దామోర్ మోడీని యుగపురుషుడిగా అభివర్ణించాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరాడు. ఇక ఈయనకు మద్దతుగా సభలోనే చాల మంది ఎంపీలు సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక మోడీకి ఇప్పటికే పలు విదేశీ అవార్డులు అందించి గౌరవించారు.

English summary
a bjp lawmaker on monday described pm narendra modi as yugpurush and demand that he be conferred with the bharat Ratna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X