వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్‌పై మోడీ ప్రశంస: చప్పట్లు, నవ్వులు (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

డిజిటల్ యుగంలో ఊహించని విధంగా ప్రజల జీవితాలను మార్చే సత్తా ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే ఉందని భారత ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సహా ప్రముఖ సంస్థల సీఈవోలు హాజరయ్యారు.

ఐటీ కంపెనీల చీఫ్ లు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పాల్ జాకబ్స్, టిం కుక్ తదితరుల ప్రసంగాల తర్వాత ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ డిజిటల్ ఎకానమీలో భారత్, అమెరికాల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుందని చెప్పడానికి ఈ వేదికే నిదర్శనమని అన్నారు.

పిల్లలకు విద్య విషయంలో గూగుల్‌ ఉపాధ్యాయులు, కటుంబ పెద్దలకు పాత్ర లేకుండా చేస్తోందని మోడీ వ్యాఖ్యానిస్తే, సమావేశం ప్రాంగణం చప్పట్లు, నవ్వులతో నిండిపోయింది. మొబైల్ టెక్నాలజీ ప్రవేశంతో కొత్త శకం మొదలైందని అభిప్రాయపడ్డ మోదీ, డిజిటల్ ఇండియా కల సాకారానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నట్టు తెలిపారు.

ప్రపంచంలో చివరిగా సూర్యాస్తమయాన్ని చూసే సిలికాన్ వ్యాలీలో నిత్యమూ ఎన్నో కొత్త ఆలోచనలు, ప్రొడక్టులు ఉదయిస్తూ, మానవాళికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా నిత్యమూ ఈ సమావేశానికి హాజరైన వారిని కలుస్తూనే వున్నానని వెల్లడించిన ఆయన, అందుకు సామాజిక మాధ్యమాలు ఎంతో సహకరిస్తున్నాయని తెలిపారు.

సోషల్ మీడియా వాడకం విస్తృతమైన తర్వాత ప్రజల మధ్య సామాజిక అంతరాలు తగ్గిపోతున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రతి ఐటీ కంపెనీకీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మన ఇరుగు పొరుగు అంటూ పేర్కొన్నారు.

తాము అధికారంలోకి రాగానే సెల్‌పోన్లు, సాంకేతికతతో పేదరికంపై యుద్ధం ప్రకటించామన్నారు. ఇండియాలోని 125 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ కనెక్టివిటీని అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే బ్రాడ్ బ్యాండ్ వినియోగం 63 శాతం పెరిగిందని ప్రధాని మోడీ వివరించారు.

గత కొద్ది నెలలుగా 170కి పైగా అప్లికేషన్లను వాడటం ద్వారా పరిపాలనలో పెను మార్పులు వచ్చాయని వివరించారు. దీన్ని మరింతగా విస్తరిస్తామని, ప్రతి పల్లెలోని ప్రతి కుటుంబానికీ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు దగ్గర చేస్తామని వివరించారు. అంతకన్నా ముందు కళాశాలలు, వర్శిటీలు, హాస్టళ్లు, అన్ని రహదారులు, పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్రాంతాలు డిజిటల్ ఇండియా కిందకు తీసుకువస్తామని అన్నారు.

PM Narendra Modi takes his 'Digital India' vision to Silicon Valley, finds wide support

కేవలం ఎయిర్ పోర్టు లాంజీల్లో మాత్రమే కాకుండా, అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో వైఫై హాట్ స్పాట్‌లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే 500కు పైగా రైల్వే స్టేషన్లలో వైఫై సిగ్నల్స్ ను ఉచితంగా అందిస్తున్నామని, దీన్ని 5 వేల స్టేషన్లకు పెంచుతామని అన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని ఆయన కోరారు.

రాబోయే కాలంలో ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో మన బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు. మన సంబంధం యువత, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శక్తి ద్వారా నిర్వచిస్తుందని పేర్కొన్నారు. దీనిని చేరుకునేందుకు, ఇరు దేశాల మధ్య ఒక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడతుందన్నారు.

English summary
Prime Minister Narendra Modi is visiting the tech capital of the world - Silicon Valley - to further his dream of 'Digital India.' This rare visit by an Indian Prime Minister to the region that houses the who's who of the technology world has captivated his extensive fan club in the area and commanded the attention of major US technology companies eager to extend their reach into a promising overseas market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X