వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆనవాయితీ తప్పని నరేంద్ర మోడీ: పశ్చిమ సరిహద్దుల వైపు ప్రయాణం: జైసల్మేర్‌ లేదా భుజ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన దీపావళి ఆనవాయితీని ఈ సారి కూడా కొనసాగించబోతున్నారు. కుటుంబాలకు దూరంగా, ప్రాణాలను పణంగా పెట్టి, దేశ సరిహద్దుల్లో పహారా కాస్తోన్న జవాన్లతో ఆయన దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సారి తన రూటు మార్చారు. పశ్చిమ సరిహద్దులకు తరలి వెళ్లనున్నారు. ఏ ప్రదేశంలో ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొంటారనేది ఇంకా నిర్ధారించలేదు. గుజరాత్ లేదా రాజస్థాన్ బోర్డర్‌కు నరేంద్ర మోడీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్‌లోొని జైసల్మేర్‌, లేదా తన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని భుజ్‌కు వెళ్తారని అంటున్నారు.

అసలు అగ్నిపరీక్ష: పదవులపై పేచీ: ఎల్లుండి ఎన్డీఏ భేటీ: ముఖ్యమంత్రికి అసమ్మతి ఉచ్చుఅసలు అగ్నిపరీక్ష: పదవులపై పేచీ: ఎల్లుండి ఎన్డీఏ భేటీ: ముఖ్యమంత్రికి అసమ్మతి ఉచ్చు

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ తొలి దఫా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది నుంచీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రతి దీపావళి నాడు సరిహద్దులకు తరలి వెళ్తున్నారు. క్లిష్ట వాతావరణంలోనూ ఆయన వెనుకంజ వేయలేదు. జవాన్లకు తన చేతుల మీదుగా స్వీట్ బాక్స్‌లను అందజేస్తున్నారు. దేశం మొత్తం వారి వెంట ఉందనే సందేశాన్ని జవాన్లకు ఇవ్వడానికే తాను వారితో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొంటున్నానని చాలాసార్లు చెప్పుకొచ్చారాయన.

PM Narendra Modi to celebrate Diwali festival with jawans at Western border

Recommended Video

Diwali 2019 : Celebrate Diwali With ECO Friendly Crackers || ఎకో ఫ్రెండ్లీ దీపావళినే జరుపుకుందాం.!!

ప్రతి సంవత్సరం వేర్వేరు సరిహద్దు ప్రాంతాలను ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కీలక ప్రదేశాలకు వెళ్లొచ్చారు. ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తొలి ఏడాదే ఆయన సియాచిన్‌ను సందర్శించారు. 2015లో పంజాబ్ సరిహద్దుల్లో దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. ఆ మరుసటి ఏడాది హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. ఐటీబీపీ జవాన్లను కలిశారు. 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లో భారత్-చైనా సరిహద్దు జవాన్లతో దీవాళీ పండుగ వేడుకలను పంచుకున్నారు. గత ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌ను సందర్శించారు. ఈ సారి పశ్చిమ సరిహద్దుల వైపు వెళ్లనున్నారు.

English summary
Prime Minister Narendra Modi is all set to celebrate the festival of Diwali with security forces of our country, maintaining the tradition he started ever since he took over the position in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X