వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రికార్డు సృష్టించండి .. ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొనండి : ప్రధాని మోడీ , జేపీ నడ్డా పిలుపు

|
Google Oneindia TeluguNews

బీహార్ లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది . బీహార్ లో ఈ రోజు జరుగుతున్న ఫైనల్ వార్ లో 78 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది .నేడు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు . ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు . ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని కొత్త రికార్డు సృష్టించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం ట్వీట్ చేశారు.

Bihar elections.. ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ .. మాటల యుద్ధంBihar elections.. ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ .. మాటల యుద్ధం

భారీ గా ఓట్లు వెయ్యండి కానీ కరోనా నిబంధనలు పాటించండి: మోడీ

భారీ గా ఓట్లు వెయ్యండి కానీ కరోనా నిబంధనలు పాటించండి: మోడీ

బీహార్ రాష్ట్ర ఎన్నికలలో మూడవ మరియు చివరి దశ పోలింగ్ లో ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని , ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని కొత్త రికార్డు సృష్టించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు . అందరూ మాస్కులు ధరించి, సామాజిక దూర నిబంధనలు పాటించి కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

 బీహార్ పురోగతికి ఓటు వేసి సహకరించండి : జేపీ నడ్డా

బీహార్ పురోగతికి ఓటు వేసి సహకరించండి : జేపీ నడ్డా

బీహార్‌లోని 78 నియోజకవర్గాల్లో 3 వ దశకు పోలింగ్ ప్రారంభమైనందున శనివారం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బిజెపి చీఫ్ జెపి నడ్డా ఓటర్లను అభ్యర్థించారు. నేడు, బీహార్‌లో చివరి దశ ఓటింగ్ జరుగుతోంది. కోవిడ్ యొక్క జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకుని బీహార్ పురోగతికి సాధ్యమైనంతవరకు ఓటు వేయడం ద్వారా ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు .

 15 జిల్లాల్లో ఉన్న 2.3 కోట్లకు పైగా ఓటర్లు .. కొనసాగుతున్న ఫైనల్ వార్

15 జిల్లాల్లో ఉన్న 2.3 కోట్లకు పైగా ఓటర్లు .. కొనసాగుతున్న ఫైనల్ వార్

రాష్ట్రంలో 12 కి పైగా ప్రచార ర్యాలీలలో ఎన్డీయే కూటమి విజయం కోసం ప్రసంగించిన మోడీ ప్రజలు ఎన్డీఏను మళ్ళీ ఎన్నుకుంటామని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారని ధీమా వ్యక్తం చేశారు . నితీశ్ కుమార్ - బిజెపి-జెడియు భాగస్వామ్యంతో ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవిని కట్టబెట్టాలని అభ్యర్థించారు. ఈ ర్యాలీలలో ప్రధాని మోదీ నితీష్ కుమార్‌తో వేదికను పంచుకున్నారు. 15 జిల్లాల్లో ఉన్న 2.3 కోట్లకు పైగా ఓటర్లు ఈ రోజు ఓటు వేయడానికి బారులు తీరుతున్నారు . కరోనావైరస్ మహమ్మారి కారణంగా, మావోయిస్టు దెబ్బతిన్న ప్రాంతాలలో మినహా పోలింగ్ సమయాన్ని ఒక గంట పొడిగించారు.

English summary
Prime Minister Narendra Modi this morning tweeted an appeal for the voters in Bihar to "set a new record" as polling began in 78 of the 243 seats of the state for the last phase of the country's biggest election amid the novel coronavirus pandemic. modi says that I appeal to all the voters to step out in large numbers and participate in this festival of democracy and set a new record. And yes, please wear a mask and adhere to the social distancing norms," the Prime Minister tweeted in Hindi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X