వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణ స్నేహితుడు అరుణ్ జైట్లీ లేరని విదేశాల్లో కన్నీరు పెట్టుకున్న ప్రధాని, జెంటిల్ మేన్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ట ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటన (UAE)లో ఉన్న ప్రధాని మోడీ స్నేహితుడు జైట్లీ దూరం అయ్యారని కన్నీరు పెట్టుకున్నారు. ప్రధాని మోడీ వరుస ట్వీట్ లు చేసి విచారం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్‌​ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప ప్రాణ స్నేహితుడిని కోల్పోయానని ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ ఇకలేరనే సమాచారం నన్ను ఎంతో బాధకు గురిచేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

<strong>రాష్ట్ర విభజన సమయంలో..ఏపీ పక్షాన జైట్లీ : హోదా కోరారు..ప్యాకేజి ప్రతిపాదించారు ..!! </strong>రాష్ట్ర విభజన సమయంలో..ఏపీ పక్షాన జైట్లీ : హోదా కోరారు..ప్యాకేజి ప్రతిపాదించారు ..!!

దేశానికి, పార్టీకి సేవ

దేశానికి, పార్టీకి సేవ

ఏ సమస్య అయినా వెంటనే అర్థం చేసుకుని పరిష్కరించగల సమర్థవంతమైన నాయకుడు అరుణ్ జైట్లీ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు శక్తి వంచన లేకుండా పాటుపడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారతదేశానికి, బీజేపీకి అరుణ్ జైట్లీ చేసిన సేవలకు విలువ కట్టలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

చాల గొప్ప వ్యక్తి

చాల గొప్ప వ్యక్తి

ఎంతో మంది గొప్ప వ్యక్తుల్లో అరుణ్ జైట్లీ ఒకరని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎంతో కాలంగా ఇద్దరం కలిసి ప్రజాసేవ చేశామని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. అరుణ్ జైట్లీ రాజకీయ జీవితంలో విద్యార్థి నాయకుడిగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో అత్యన్నత పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని, నేటి యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

జైట్లీ జెంటిల్ మేన్

జైట్లీ జెంటిల్ మేన్

అరుణ్ జైట్లీ గొప్ప రాజకీయ నాయకుడు, భారతదేశ చరిత్ర, న్యాయశాస్త్రం, ప్రజా విధానం, పరిపాలన తదితర అంశాలపై అరుణ్ జైట్లీకి ఉన్న పట్టు వర్ణించలేమని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. సమర్థవంతమైన నాయకుడు అరుణ్ జైట్టీని కోల్పోయామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ లో విచారం వ్యక్తం చేశారు.

రారాజుగా బతికిన జైట్లీ

రారాజుగా బతికిన జైట్లీ

అరుణ్ జైట్లీ రారాజుగా బతికారని, తాను ఎన్నో దేశాలు తిరిగి వచ్చిన తరువాత అక్కడి విషయాలు తాను ఆయనతో క్షుణ్ణంగా చర్చిచానని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆఖరి క్షణాలలో తాను అరుణ్ జైట్లీ దగ్గర లేకపోయానని ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.

జీవితాలు నిలిపిన నేత

జీవితాలు నిలిపిన నేత

అరుణ్ జైట్లీ ఎంతో మంది జీవితాలు నిలిపిన నేత అని బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఏబీవీపీ, బీజేపీలకు ఎనలేని సేవలు అందించిన అరుణ్ జైట్లీ చాల మంది విద్యాభ్యాసం కోసం సహాయం చేశారని బీజేపీ నేతలు గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ దేశంలోని యువతకు ఆదర్శంగా నిలిచారని, ముఖ్యంగా వేలాది మంది న్యాయవాదులు ఆయన లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.

English summary
PM Narendra Modi who is in UAE, sent condolence message for former minister Arun Jaitley demise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X