వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ ప్రచారం, కర్ణాటక కోస్తాలో కాంగ్రెస్ నేతలకు గుబులు, సీన్ రివర్స్, లవ్ జీహాద్, డ్రగ్స్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక కోస్తా తీర ప్రాంతాల్లో ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రచారంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. హిందూ ఓటు బ్యాంకు చీలిపోకుండా బీజేపీ నాయకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లవ్ జీహాద్, డ్రగ్స్ విక్రయాలు తదితర సమస్యలు తెరమీదకు తెచ్చి సీన్ రివర్స్ చెయ్యాలని బీజేపీ నాయకులు పక్కా ప్లాన్ వేశారు.

కోస్తా ప్రత్యేకత వేరు

కోస్తా ప్రత్యేకత వేరు

కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కోస్తాతీర ప్రాంతాల రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అభివృద్ధి, లింగాయత్‌లకు మతపరమైన రిజర్వేషన్లు, సామాజిక మార్పు, ప్రత్యేక పథకాలు కోస్తాతీర ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావం చూపించవు. ఇక్కడ హిందువులతోపాటు, ముస్లింలు, క్రిస్టియన్‌ల జనాభా సరిసమానంగా ఉంటుంది. మతపరమైన ఘర్షణలు అనేకసార్లు జరిగాయి.

హిందూ కార్యకర్తల హత్యలు

హిందూ కార్యకర్తల హత్యలు

కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 24 మంది హిందూ సంఘ, సంస్థల కార్యకర్తలు హత్యకు గురైనారు. ఎక్కువ మంది హిందూ కార్యకర్తలు హత్యకు గురైయ్యింది కర్ణాటకలోని కోస్తా తీర ప్రాంతాల్లోనే. కర్ణాటకలోని కోస్తా తీర ప్రాంతాలు చాల సున్నితమైనవి.

ప్రధాని మోడీ ప్రచారం

ప్రధాని మోడీ ప్రచారం

శనివారం ప్రధాని మోడీ మంగళూరులో శాసన సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ ప్రచారంతో ఇక్కడి రాజకీయాలు మారిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

డ్రగ్స్ విక్రయాలు

డ్రగ్స్ విక్రయాలు

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోస్తా తీర ప్రాంతాల్లో నేరాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ విక్రయాలు, మాదకద్రవ్యాల వినియోగం, అటవీ భూములు కబ్జా తదితర సమస్యలు కాంగ్రెస్ పార్టీని విపరీతంగా పీడిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వం చెప్పిన లెక్కలే కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత ఆందోళన చెందుతున్నారు.

లవ్ జీహాద్ పెద్ద సమస్య

లవ్ జీహాద్ పెద్ద సమస్య


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోస్తా తీరప్రాంతాల్లో లవ్ జీహాద్ ఘటనలు చాలపెరిగిపోయాయి. హిందూ సంఘ, సంస్థలు లవ్ జీహాదకు వ్యతిరేకంగా అనేక సార్లు ఆందోళనలు, పోరాటం చేశారు. లవ్ జీహాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ హవా

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ హవా

కర్ణాటక కోస్తా తీర ప్రాంతాల్లో 21 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, ఇతరులకు మూడు సీట్లు వచ్చాయి. అయితే 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు లోక్ సభ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించింది.

మోడీ దెబ్బకు కాంగ్రెస్ !

మోడీ దెబ్బకు కాంగ్రెస్ !


గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2013 శాసన సభ ఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోడీ ఈ ప్రాంతాల్లో పర్యటించినా పెద్ద ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడు ప్రధాని హోదాలో వస్తున్న నరేంద్ర మోడీ హిందూ కార్యకర్తల హత్యలు, లవ్ జీహాద్, డ్రగ్స్ మాఫియా తదితర సమస్యలు ముందు పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

English summary
Prime Minister Narendra Modi will address four public rallies in poll bound Karnataka on Saturday. As part of his campaign blitzkrieg, the Prime Minister will address election rallies in Tumkur, Gadag, Shimoga and Mangaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X