వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరే టాప్: మోడీ 'టైమ్', యాహూలో ముఖేష్ అంబానీ, సత్య నాదెళ్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నెటిజన్లలో తనకున్న ఫాలోయింగ్‌ను ప్రధానమంత్ర నరేంద్ర మోడీ మరోసారి నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా టైమ్‌ మ్యాగజీన్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో ఆయన పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌‌గా నిలిచారు. మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 16 శాతాన్ని మోడీ సాధించారు.

భారత్‌ నుంచి ఎక్కువ మంది నెటిజన్లు ఆయనకు మద్దతు తెలిపారు. మొత్తం 225 దేశాలకు చెందిన పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. కాగా, ఇటీవల ఇదే మ్యాగజీన్‌ నిర్వహించిన మరో సర్వేలో మోడీ స్థానం దిగజారిన సంగతి తెలిసిందే.

ఆన్‌లైన్లో అత్యధికులు శోధించింది వీరికోసమే..

PM Narendra Modi wins TIME's Readers' Poll, loses 'Person of the Year' title

ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఆన్‌లైన్లో అత్యధికులు వెతికిన వ్యక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేష్ అంబానీయేనని సెర్చ్ ఇంజిన్ యాకూ పేర్కొంది. యాహూ ఇండియా ఇయర్ ఇన్ రివ్యూ ఏడో ఏడిషన్ ప్రకారం ఆన్ లైన్ వినియోగదార్లు ఎవరెవరిని, ఏ సాంకేతిక వస్తువులను, కార్లను వెతికారని తెలిపింది.

రిలయన్స్ అధిపతి ముకేష్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, అదానీ గ్రూపు చీఫ్ గౌతమ్ అదానీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, ఇన్పోసిస్ సీఈవో, ఎండీ విశాల్ సిక్కా, ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్, స్నాప్ డీల్ అధిపతి రోహిత్ బన్సాల్, టోటల్ సీఈవో క్రిష్టోఫీ డీ మార్గేరీ, టాటా మోటర్స్ ఎండీ కార్ల్ స్లిమ్‌లను వెదికారు.

అయితే, ఇందులో మార్గెరీ విమాన ప్రమాదంలో, కార్ల్ స్లిమ్ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఫోన్లు, ఇతర వస్తువుల విషయానికి వస్తే యాపిల్ ఐపోన్ 6, శాంసంగ్ గెలాక్సీ ఎస్5, శాంసంగ్ గెలాక్సీ నోట్ , మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ ఒన్, అమెజాన్ కిండిల్ ఫైర్, సోనీ ప్లే స్టేషన్ 4, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో3ను వెతికారు.

English summary
Prime Minister Narendra Modi on Monday won TIME magazine's online readers' poll, but lost the title of 'Person of the Year'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X