వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటికాంతులు నింపాలని, ఆనంద దీపాలు వెలగాలని.. ప్రధాని మోడీ, జగన్, కేటీఆర్ విషెస్..

|
Google Oneindia TeluguNews

నేడు దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. పండగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంద‌రి జీవితాల్లో ఆనందం వెళ్లివిరియాల‌ని ఆయన ఆకాంక్షించారు. పండుగ ప్ర‌కాశ‌వంతంగా జరగాలని చేయాల‌ని, ప్రతీ ఒక్కరికీ ఆనందాన్ని క‌లిగించాలని కోరుకున్నారు. అందరు సంప‌న్నంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని మనసారా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఈ సారి రాజస్తాన్‌లో..


దీపావళి రోజున సైనికులతో గడిపే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ సారి కూడా రాజస్తాన్‌లోని జైసల్మీర్‌‌ సరిహద్దులో భారత సైనికులతో కలువబోతున్నారు. సైనికుల్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు మోదీ ప్రతీ ఏటా దీపావళి రోజున సైనికులతో గడుపుతున్నారు. 2014లో ప్రధాని అయినప్పటినుంచి ప్రతీ దీపావళిని సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు.

జగన్ శుభాకాంక్షలు


ఇటు ప్రజలకు ఏపీ సీఎం జగన్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి విష్ చేశారు. దీపావలి ప్రజల జీవితాల్లో కోటికాంతులు నింపాలని కోరుకున్నారు. ప్రతీ ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతుడిని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

కేటీఆర్ శుభాకాంక్షలు

చీకటిని తరిమికొట్టి వెలుగులను నింపే దీపావళి.. ప్రజలందరీలో సరికొత్త కాంతు లు నింపాలని మంత్రి కేటీఆర్ కోరుకున్నారు. ప్రతీ ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య సురక్షితంగా పండగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Recommended Video

Diwali 2020: Restrictions on Crackers | Green Firecrackers Only for 2 Hours | Oneindia Telugu

విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తులపై దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పర్వదినం రోజున అందరికీ శుభం కలుగాలని ఆకాంక్షించారు. సంపద, సౌభాగ్యం కలగాలని కోరారు. ఈ దీపావళి ప్రతీ ఇంటి కోటి కాంతులు నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

English summary
Prime Minister Narendra Modi greeted the nation on the occasion of Diwali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X