వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకులో రూ.80 లక్షలు.. రూ.10 వేలు విత్ డ్రా చేసే ఛాన్స్... ఆగిన గుండె...

|
Google Oneindia TeluguNews

బ్యాంకుల నగదు ఉంటే భద్రంగా ఉంటుందని ఖాతాదారులు అనుకొంటారు. అందుకే తక్కువ వడ్డీకి అయిన సరే ఖాతాలో నగదు డిపాజిట్ చేస్తారు. అవసరం ఉన్నప్పుడు నగదు తీసుకొవచ్చని భావిస్తారు. కానీ పంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన స్కాం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బ్యాంకు నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేసే వీలు ఉండటం.. నగదు ఉన్న తీయలేని పరిస్థితుల్లో ఓ ఖాతాదారుడి తండ్రి గుండె ఆగిపోయింది.

 ఖాతాలో నగదు.. కానీ

ఖాతాలో నగదు.. కానీ

ముంబైలోని ములుంద్‌కి చెందిన మురళిధర్ ధారకు 80 ఏళ్లు. అతని కుమారుడు ప్రేమ్ ధారకు పీఎంసీ బ్యాంకులో ఖాతా ఉంది. బ్యాంకులో రూ.80 లక్షల నగదు కూడా ఉంది. అయితే ఇటీవల బ్యాంకులో స్కాం వెలుగుచూడటంతో విత్ డ్రా పరిమితిని తగ్గించారు. తొలుత రూ. వెయ్యి రూపాయలు.. తర్వాత రూ.10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే కొందరు నగదు డిపాజిట్ చేసి కూడా తీసుకోలేదని దుస్థితిలో ఉన్నారు.

బైపాస్ సర్జరీ చేయాలి..

బైపాస్ సర్జరీ చేయాలి..

మురళిధర్‌ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే గుండెపోటు రావడంతో అతని కుమారుడు ఆందోళన చెందారు. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అందుకోసం లక్షలు కావాలి.. ప్రేమ్‌ధర వద్ద డబ్బులు ఉన్నాయి. కానీ బ్యాంకులో ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. రూ.10 వేలకు మించ్ విత్ డ్రా చేసే వీలు లేదు. దీంతో డబ్బులు కట్టకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేయలేదు. మురళిధర్ ఐసీయూలోనే కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలాడు.

ఏం చేయను..

ఏం చేయను..

తన తండ్రి కళ్లముందే చనిపోవడంతో ప్రేమ్‌ధార గుండెలవిసేలా రోదించాడు. తన వద్ద డబ్బులు ఉన్న వైద్యం చేయించలేని స్థితిలో ఉండిపోయానని రోదించాడు. తనకు వచ్చిన పరిస్థితి మరేవరికి రావొద్దని కోరారు. బ్యాంకులో పెద్దలు చేసిన స్కాం.. తమ కుటుంబం పట్ల శాపంగా మారిందని వాపోయాడు. ప్రేమ్‌ధార బంధువులు, స్నేహితులు ప్రభుత్వాన్ని, బ్యాంకును తప్పుపట్టారు. తమ నగదు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు.

 మరో ముగ్గురు కూడా..

మరో ముగ్గురు కూడా..

మురళిధరే కాదు మరో ముగ్గురు కూడా నగదు తీసుకోలేక ఆసువులు బాశారు. సంజయ్ గులాటీ అనే 51 ఏళ్ల ఖాతాదారుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. సంజయ్ ఖాతాలో రూ.90 లక్షలు ఉన్నాయి. మరో ఈ నెల 15న 39 ఏళ్ల నివేదిత అనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నారు. తన డబ్బులు బ్యాంకులో ఉండటం.. తీసుకొనే వీలు లేకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.

English summary
PMC Bank scam claimed fourth life on Friday after an 80-year-old man, identified as Muralidhar Dhara, died of a heart attack in Mumbai, Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X