వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎంకే నిరసనలో అపశృతి: రైలుపైకెక్కిన యువకుడు మృతి(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

పీఎంకే నిరసనలో అపశృతి: రైలుపైకెక్కిన యువకుడు మృతి

చెన్నై: కావేరీ వాటర్ బోర్డు కోసం తమిళనాడులో పీఎంకే బుధవారం తలపెట్టిన రైల్ రోకోలో అపశ్రుతి చోటు చేసుకుంది. తిండివనంలో రైల్ రోకో చేస్తూ ఇద్దరు వ్యక్తులు రైల్ పైకి ఎక్కారు.

రైలుపైకి ఎక్కినినాదాలు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని పీఎంకే కార్యకర్త రంజిత్‌గా గుర్తించారు.

PMK man walks on top of train during cauvery protest, gets electrocuted

కాగా, రైలుపై కెక్కిన మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పీఎంకే కార్యకర్తలు నిరసనల్లో భాగంగా రోడ్లపై నిరసనలు చేపట్టారు. రైల్వే స్టేషన్లలో ఆందోళనలను నిర్వహించి, పలు రైళ్లను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది.

పలు చోట్ల ఆందోళన చేస్తున్న పీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎంకే కార్యకర్త మృతి పట్ల పీఎంకే నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా సంతాపం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కావేరి బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడులో అన్ని పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

English summary
In a shocking incident a PMK worker, who was walking on top of a train in Tindivanam in Tamil Nadu, was electrocuted on Wednesday. The man, identified as 32-year-old Ranjith, was part of the rail mariyal (protest by blocking trains) staged by the PMK over the Cauvery issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X