వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల సుబ్రమణ్యం ఆరోగ్యంపై పీఎంవో ఆరా, పళనిస్వామి, వెంకయ్య కూడా, వారంలో క్యూర్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసిందిం. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పీఎంవో అధికారులు ఆస్పత్రి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకిన బాలు.. చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన క్షేమంగా కోరుకోవాలని అభిమాన లోకం కోరుకుంటుంది. ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి మార్చడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం నిలకడగానే ఉంది అని వైద్యులు తెలిపారు. ప్లాస్మా థెరసీ నిర్వహించాలని భావిస్తున్నారు.

Recommended Video

SP Balasubrahmanyam : ICU కి తరలింపు, కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న ఫ్యాన్స్ | Oneindia Telugu

పీఎంవో అధికారులు ఆస్పత్రి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుకి అందిస్తోన్న వైద్యం, స్పందిస్తోన్న తీరు గురించి సీఎం పళని స్వామి కూడా తెలుసుకుంటున్నారు. ప్రధాని మోడీకి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి.. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. గాన గంధర్వుడి ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు/ పూజలు చేస్తున్నారు.

pmo inquires about sp balu health condition..

బాలు ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం సులభంగా శ్వాస తీసుకుంటున్నారని వెల్లడించారు. మరో వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. మరోవైపు బాలు భార్య కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగుందని.. మూడు రోజుల్లో వైరస్ నుంచి కోలుకుంటారని చరణ్ తెలిపారు.

English summary
prime minister office inquiry about sp balasubramanyam health condition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X