వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ స్కాంలో నీరవ్, ఛోక్సీలకు షాక్: అరెస్ట్ వారెంట్ జారీ

|
Google Oneindia TeluguNews

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణంలో డైమండ్‌ వ్యాపారి నీరవ్ మోడీ, గీతాంజలి జెమ్స్‌ అధిపతి మెహుల్‌ చోక్సీలకు భారీ షాక్ తగిలింది. స్కాం కేసుపై సీబీఐ, ఈడీలు విస్తృతదాడులు చేస్తూ, ఆస్తులను స్వాధీనం చేసుకుంటుండగా.. శనివారం నీరవ్, ఛోక్సీలకు ముంబై స్పెషల్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

విదేశాల్లో వ్యాపార వ్యవహారాల నిమిత్తం విచారణ హాజరుకాలేనని మొండికేసిన నీరవ్‌ మోడీకి వచ్చే వారం కచ్చితంగా విచారణకు హాజరుకావల్సిందేనంటూ ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఎ కోర్టు ఆదేశించింది.

 PNB fraud case: Non-bailable warrants issued against Nirav Modi, Choksi

ఈ మేరకు హైకమిషన్‌ను సంప్రదించాలని మోడీ, చోక్సీలను సీబీఐ కోరింది. వారి ప్రయాణ కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. దాదాపు 12వేలకోట్ల రూపాయల కుంభకోణం కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ మోడీ, చోక్సిల చుట్టూ ఉచ్చు బిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

వేలకోట్లను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోడీ, చోక్సీలకు చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతోపాటు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాల్సిందిగా ఇప్పటికే సీబీఐ పీఎంఎల్‌ఎ కోర్టును కోరాయి.

English summary
A special PMLA court in Mumbai on Saturday issued non-bailable warrants against diamond traders Nirav Modi and Mehul Choksi in connection with the PNB fraud case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X